https://oktelugu.com/

కేంద్ర బృందం తీరుపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి ప్రయత్నాలు, లాక్ డౌన్ అమలు తీరు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడి పరిస్థితుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు మీడియాలో వచ్చిన కధనాల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించిన ఆ బృందం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో సహా తాము అందజేసిన అంశాలను కూడా తమ నివేదికలో చేర్చలేదని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2020 / 06:07 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి ప్రయత్నాలు, లాక్ డౌన్ అమలు తీరు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడి పరిస్థితుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు మీడియాలో వచ్చిన కధనాల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించిన ఆ బృందం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో సహా తాము అందజేసిన అంశాలను కూడా తమ నివేదికలో చేర్చలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ కార్యదర్శికి ఒక లేఖ వ్రాసారు. ఆ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ, వాస్తవాలు తెలుసుకోవడానికి మరో కేంద్ర బృందాన్ని పంపించాలని డిమాండ్ చేశారు.

    కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ

    కరోనా యొక్క ప్రభావాన్ని తక్కువ చేసి చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. తక్కువ మరణాలు, తక్కువ కేసులు చూపించేందుకు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి పరీక్షలు చేయడం లేదని, వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయడం లేదని సంజయ్ ధ్వజమెత్తారు.

    పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన గాంధీ ఆసుపత్రిలోనే అరకొర సదుపాయాలు ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా అక్కడ పారిశుధ్య పరిస్థితులు సక్రమంగా లేవని, తగినన్ని మరుగుదొడ్లు లేవని, చాలావరకు గదులు, వార్డులకు ప్రత్యేక బాత్‌రూమ్‌లు లేదని వివరించారు. శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు, సహాయక సిబ్బంది సరిపడా లేరని స్పష్టం చేసారు.

    లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

    కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌ను అనుసరించడం లేదని సంజయ్ పేర్కొంటూ ఈ సందర్భంగా కరోనాతో మృతిచెందిన సి ఎస్ శాస్త్రి అనే 80 ఏళ్ళ వృద్ధుడి ఉదంతాన్ని ప్రస్తావించారు. కరోనా అనుమానంతో ఏప్రిల్ 12 న గాంధీ ఆసుపత్రికి వెడితే, పరీక్ష తర్వాత అతన్ని నెగెటివ్‌గా ప్రకటించారు. నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్ గా ప్రకటించారని సంజయ్ తెలిపారు.

    దానితో తిరిగి గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ ఏప్రిల్ 26 న తుది శ్వాస విడిచారని తెలిపారు. అయితే కేంద్ర బృందంపై ఇచ్చిన నివేదికలలో అతని మరణం చూపలేదని సంజయ్ వెల్లడించారు.

    ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు.