Balakrishna Media: గాడిద.. జర్నలిస్టుకే తెలుగు నేర్పిన బాలయ్య.. వీడియో వైరల్

Balakrishna Media: : ఆవేశం వచ్చినా అనుగ్రహం వచ్చిన మన బాలయ్య బాబును మాత్రం కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.. ఇప్పటికే ఆయన చేతుల్లో చెంప దెబ్బలు తిన్న వారి లిస్ట్ భారీగానే ఉంది. ఇక తిట్లు తిన్న వారిది చాంతాడంత ఉంటుంది. అయినా కూడా ఈ స్టార్ తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు. సినిమాల్లో విలన్లను తిట్టినట్టే బయట తిక్కతిక్క వేశాలు వేసిన వారిని తిట్టిపోస్తున్నాడు. అదే ఇప్పుడు బాలయ్యను చిక్కుల్లో పడేస్తోంది. […]

Written By: NARESH, Updated On : January 18, 2022 5:39 pm
Follow us on

Balakrishna Media: : ఆవేశం వచ్చినా అనుగ్రహం వచ్చిన మన బాలయ్య బాబును మాత్రం కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.. ఇప్పటికే ఆయన చేతుల్లో చెంప దెబ్బలు తిన్న వారి లిస్ట్ భారీగానే ఉంది. ఇక తిట్లు తిన్న వారిది చాంతాడంత ఉంటుంది. అయినా కూడా ఈ స్టార్ తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు. సినిమాల్లో విలన్లను తిట్టినట్టే బయట తిక్కతిక్క వేశాలు వేసిన వారిని తిట్టిపోస్తున్నాడు. అదే ఇప్పుడు బాలయ్యను చిక్కుల్లో పడేస్తోంది.

బాలయ్య బాబులో చిన్న పిల్లాడు.. ఆవేశ పరుడు సహా ఓ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడు. సినిమాల్లో అంటే నడుస్తుంది. అదే బయట చేస్తేనే ప్రాబ్లం.. టీడీపీ కార్యకర్తలు, సినీ అభిమానులు అంటే పడుతారు. కానీ విలేకరులపై కూడా అలానే నోటిదురుసు వాడితే బాలయ్యను చెడుగుడు ఆడేస్తారు. తాజాగా అదే జరిగింది..

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాన్నకు నివాళులర్పించడానికి ఘాట్ కు వచ్చాడు బాలయ్య. పూలమాలలు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడడానికి వస్తున్నాడు. బెల్లం చుట్టూ ఈగల వలే.. బాలయ్యను చూడగానే రిపోర్టర్లు కంటెంట్ దొరుకుతుందని ఎగబడ్డారు. ఈక్రమంలోనే బాలయ్య ‘వ్యక్తిగత దూరం పాటించండి’ అంటూ రిపోర్టర్లకు సలహా ఇచ్చాడు.

అయితే పక్కనే ఉన్న ఓ రిపోర్టర్ ‘సామాజిక దూరం’ అని కౌంటర్ ఇచ్చాడు. దీనికి ఒళ్లు మండిన తెలుగు భాషాభిమాని బాలయ్య ‘గాడిద.. అది సామాజికదూరం కాదు.. వ్యక్తిగత దూరం’ అంటూ జర్నలిస్టునే తిట్టేశాడు.  భాషపై పట్టు ఉండే జర్నలిస్టు తప్పు మాట్లాడితే బాలయ్య వదల్లేదు. దాన్ని కరెక్ట్ చేసి మరీ మాస్టర్ లా ‘గాడిద’ అంటూ తిట్టిపోశాడు.  ఆ వీడియో కాస్త బయటకు రావడం.. వైరల్ అవ్వడం జరిగిపోయింది. విలేకరినే తిట్టిన బాలయ్య అంటూ మీడియా ఆడిపోసుకుంది. బాలయ్యను ట్రోల్ చేస్తుంది. భాషాభిమానులు మాత్రం బాలయ్య చేసిన పనికి కొనియాడుతున్నారు.

అయినా బాలయ్యకు ఇలా తిట్టడాలు.. కొట్టడాలు పిచ్చ లైట్..రెండు మూడు రోజులు ఇలానే గోల చేసి మరిచిపోతారు.. బాలయ్య మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన దూకుడు తగ్గించుకోకుండా ఇలానే తిట్టుకుంటూ పోతారు.. ‘బ్లడీ ఫూల్’ అంటూ ఫైర్ అవుతారు. బాలయ్యను బాలయ్యగానే వదిలేస్తే మంచిదంటున్నారు.