Balakrishna- Pawan Kalyan: తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, నందమూరి బాలక్రిష్ణలు భిన్న వ్యక్తులు.. వారి వ్యక్తిత్వాలు కూడా భిన్నమైనవవి. ఇద్దరూ ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ లో ఉన్నారు. పవన్ జనసేన అధ్యక్షుడిగా.. బాలక్రిష్ణ టీడీపీ నాయకుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వారిద్దరూ అనూహ్యంగా కలుసుకొని చర్చలు జరపడం ఏపీ పాలిటిక్స్ లో కాక రేపుతోంది. వారి ఏకాంత భేటీ హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ కలవడం చాలా అరుదు. ఈ మధ్యన బాలక్రిష్ణ హోస్ట్ గా ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే ప్రొగ్రాం నడుస్తోంది. ప్రముఖులతో బాలక్రిష్ణ చేస్తున్నఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. నెంబర్ వన్ టాక్ షో గా గుర్తింపు పొందింది. అయితే ఆ మధ్యన బాలక్రిష్ణ నేరుగా దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి టాక్ షోకు ఎప్పుడు వస్తున్నారని అడగడమే కాకుండా.. ఎవరితో వస్తారో తెలుసు కదా అంటూ పరోక్షంగా పవన్ గురించి ప్రస్తావించారు. పవన్ తో త్రివిక్రమ్ ది ప్రత్యేక బంధం అని అందరికీ తెలిసిందే. బాలక్రిష్ణ ఇలా ప్రశ్నించి ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచేశారు. అయితే ఇప్పుడు పవన్, బాలక్రిష్ణులు ఏకంతంగా చర్చలు జరపడం అటు సిని,., ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఇద్దరి హీరోల సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ హరిహరవీరమల్లు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య వీరసింహారెడ్డి చిత్రీకరణ పక్కనే జరుగుతుండడంతో.. పవన్ బాలక్రిష్ణను కలిసేందుకు సెట్ కి వెళ్లారు. చిత్ర యూనిట్ కు పవన్ అల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. వీరసింహారెడ్డితో హరిహరవీరమల్లు అంటూ పోస్టింగులు, కామెంట్లు పెడుతున్నారు. క్రేజీ కాంబినేషన్ గా అభివర్ణిస్తున్నారు. అయితే పవన్ 20 నిమిషాల పాటు బాలక్రిష్ణతో ఏకాంతంగా భేటీ అయ్యారు. వీటి వివరాలు మాత్రం బయటకి రావడం లేదు. ఏపీ రాజకీయాలపైనే ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ విముక్త ఏపీ కోసం కృషిచేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వనని కూడా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని.. అవసరమైతే అన్ని పార్టీలను ఒకే వేదికపై తీసుకొస్తానన్న రీతిలో పవన్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైందన్న వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాలక్రిష్ణతో పవన్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. అసలు బాలక్రిష్ణతో పవన్ ఏం చర్చించారు. వారి మధ్య ఏ స్థాయిలో చర్చలు జరిగాయి .అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయే తప్ప.. ఈ భేటీ గురించి వారిద్దరూ మాట్లాడలేదు. బయటకు చెప్పలేదు కూడా. అయితే వారు ఏపీకి సంబంధించి చాలారకాలుగా మాట్లాడినట్టు తెలుస్తోంది.

అయితే బాలయ్య, పవన్ ది మాత్రం క్రేజీ కాంబినేషన్. ఆది నుంచి నందమూరి, మెగా అభిమానుల మధ్య ఓ రకమైన పోటీ వాతావరణం ఉండేది. అక్కడక్కడ ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా జరిగేవి. కానీ ఇటీవల వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇరు కుటుంబాల హీరోల మధ్య స్నేహం పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మిత్రులు. అల్లు అరవింద్ నిర్మాతగా బాలక్రిష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రొగ్రాం సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. మెగా కాంపౌండ్ హీరోల వేడుకలకు బాలక్రిష్ణ హాజరవుతున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్ షిప్ఫ్ కు అద్దంపట్టేలా పవన్, బాలక్రిష్ణ భేటీ కొనసాగడం విశేషం.