ఎన్టీఆర్ తనయుడు.. ప్రముఖ నటుడు.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. బాలయ్యకు కోపం వస్తే.. ఉగ్ర నరసింహుడైపోతాడు. చుట్టూ ఎవరున్నది చూసుకోడు. పూనకంతో ఊగేస్తాడు. ఆవేశంలో ఏం చేస్తున్నాడో తెలియకుండానే ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటాడు. బాలయ్య కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. అయితే దాన్ని అవకాశంగానో.. ఆవేశంగానో తీసుకుంటున్న బాలయ్య బాబు.. అభిమానులపై చేయి చేసుకుంటున్నారు. తన ఆకతాయి చేష్టలతో తరుచూ ఇదే తరహాలో ప్రవర్తిస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు.
Also Read: వైఎస్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మంలో కలకలం
సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో హిందూపురం ఏరియాలోనే బాలకృష్ణ అనుచితంగా ప్రవర్తించారు. రాజకీయ ప్రచారం అయినా.. షూటింగు స్పాటయినా.. బాలయ్య పూనకానికి ఎక్కడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఇక బాలకృష్ణ రెచ్చిపోయి కొట్టిన వీడియోలు వైరల్ అయ్యాక.. ఆయన అభిమానులు. తెలుగుదేశం నాయకులు.. డ్యామేజ్ ను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తారు. ఆ డ్యామేజీ కంట్రోల్ వల్ల ప్రయోజనం పక్కన పెడితే… దాన్నివల్ల మరింత డ్యామేజీ మాత్రం తప్పడం లేదు. బాలకృష్ణ రెచ్చిపోయినప్పుడల్లా.. డ్యామేజీ కంట్రలో ఒకే విధంగా ఉంటుంది. బాలకృష్ణ చేత దెబ్బలు తిన్న వాళ్ల జన్మ ధన్యం అయిందన్నట్లు చెప్పించడమే ఈ డ్యామేజీ సారాంశం.
Also Read: ముందుకు సాగని ప్రచార ‘పవనాలు’
బాలకృష్ణ చేత దెబ్బలు తిన్నవాడిచేతే.. ఆయన అలా కొట్టడం తన అదృష్టమని ఒప్పచెప్పించే ప్రయత్నం ఒకటి జరుగుతూ.. ఉంటుంది. హిందూపురంలో బాలకృష్ణ చేత దెబ్బలు తిన్న కుర్రాడి చేత కూడా అలాంటి వీడియో ఒకటి చేయించారు. బాలకృష్ణ మతిలేని చర్యలు.. అనుచిత చర్యలు పార్టీకి నష్టం అవుతాయనే లెక్కలలో టీడీపీ వాళ్లు ఈ వీడియో ప్రహసనానికి తెరతీశారు. అయితే తెలుగుదేశం పార్టీ చేసే ట్రిక్స్ మరింత పార్టీని మరింత నవ్వుల పాలు చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్యచేత తన్నులు తినడం అంత అదృష్టం అనుకుంటే.. వరుసపెట్టి తన్నించుకోవచ్చు. అదేదో సినిమాలో తన్నలు బాబా ఉన్నట్లుగా బాలకృష్ణను తన్నుల నేతగా చేసుకుని వరుసపెట్టి క్యూలో నిలబడి తన్నించుకోవచ్చు. అయితే ఈ కామెడీని జనాల ముందు ప్రదర్శిస్తూ.. టీడీపీ వాళ్లు నవ్వుల పాలవుతున్నారు. ఆయన రెచ్చిపోవడమే కామెడీ అయితే.. దాన్ని తమ అదృష్టంగా చిత్రీకరిస్తూ.. వీళ్లు మరింత కామెడీ చేసి.. స్థూలంగా బోలెడంత డ్యామేజ్ చేసుకుంటున్నారు. దీనికి బదులు బాలకృష్ణను జనాల మధ్యకు రానివ్వకుండా చూసుకుంటేనే టీడీపీకి ప్రయోజనకరమని పలువురు అంటున్నారు.