MLA Raja singh: ఒక మతంపై విద్వేష వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ లో అల్లర్లకు కారణమయ్యారన్న ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు జైళ్లలో బెయిల్ రాకుండా ఉండేలా సెక్షన్లు పెట్టారు.

ఎట్టకేలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. చాలా రోజుల ప్రయత్నాల తర్వాత ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే పలు కండీషన్లు పెట్టింది. నిజానికి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇన్నిరోజులు బయటకు రాకుండా జైల్లో పెట్టడమే ఒక సంచలనం. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీ కూడా ఈయనను బహిష్కరించింది.
సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ చర్లపల్లి జైల్లోనే ఉంటున్నాడు. పీడీ యాక్ట్ పెట్టడంతోపాటు ఆయన విద్వేశ వ్యాఖ్యలతో ఇన్నాళ్లు బెయిల్ లభించలేదు. కానీ ఇప్పుడు పలు కండీషన్లతో బెయిల్ వచ్చింది. ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని స్పష్టం చేసింది. ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని స్పష్టం చేసింది. రెండు నెలలుగా రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నాడు. ఎట్టకేలకు ఊరట లభించింది.
బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఓ మత ప్రవక్తను కించపరిచేలా రెండు నెలల క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక వర్గం స్టాండప్ కమెడియన్ ను అనుమతించిన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆ వర్గం వాళ్లపై నోరుపారేసుకున్నారు. దాంతో హైదరాబాద్ లో ఆయన ఇంటిని ప్రత్యర్థి వర్గం ముట్టడించి ఆందోళన చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పీడీయాక్ట్ కింద జైలుకు పంపారు. ఇన్నాళ్లు బెయిల్ తో ఊరట లభించింది.