Janasena : పోలీసులతో జనసేనపై దమనకాండను సాగించిన సీఎం జగన్ ఆశలు నెరవేరలేదు. విశాఖలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకొని.. జనసేన కీలక నేతలందరిపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ కు చెంప దెబ్బలాంటి తీర్పును హైకోర్టు ఇచ్చింది. 9మంది జనసేన నేతలకు ఊరట కల్పించింది. పవన్ కళ్యాణ్ ‘న్యాయ’పోరాటం గెలిచింది. జగన్ పోలీసులతో నిర్బంధిస్తే.. పవన్ ‘న్యాయంతో’ గెలిచాడు.

విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంచలనమైంది. ఇవన్నీ అక్రమ కేసులని.. విశాఖలో జనసేన నేతలపై ఆ కేసులు అక్రమమని తేల్చింది. ప్రభుత్వ దమనకాండను తూర్పారపట్టింది. అధికారంతో ఇలాంటివి చేయడం తగదని హితవు పలికింది.
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసులో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా. రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. మిగతా నాయకులకు బెయిల్ మంజూరు చేస్తూ విముక్తి కల్పించింది.
జనసేన నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ఒక ప్రకటనలో తెలిపారు. మేము ఎప్పుడూ న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా విశ్వసిస్తామని.. ఆ నమ్మకంతోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించామన్నారు. గౌరవ హైకోర్టుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలిపారు.
జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఆయన బస చేస్తున్న నోవాటెల్ హోటల్ లోకి పోలీసులు చొరబడి, ప్రతి రూమ్ ని సోదా చేసి పవన్ కళ్యాణ్ , నాగబాబు , నాదెండ్ల మనోహర్ ని మినహియించి జనసేన పార్టీ నాయకులందరినీ అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం నాడు పెను దుమారమే రేపింది. పవన్ కళ్యాణ్ ను కూడా వైజాగ్ వదిలి హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోవాలని 41A నోటీసులు జారీ చేశారు. అయితే అరెస్ట్ అయినా జనసేన నాయకులందరినీ విడుదల చేస్తే తప్ప ఇక్కడి నుండి కదిలేదు లేదని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పి విజయవాడకు వచ్చాడు. అనంతరం హైకోర్టులో న్యాయపోరాటం చేశారు. అనుకున్నట్టే జనసేన నేతలకు కోర్టులో బెయిల్ రావడంతో జనసేన నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.