Today Release Movies: పండగ అంటే మన ఇళ్లల్లో ఎలా సంబరాలు చేసుకుంటామో..సినిమా ఇండస్ట్రీ కి కూడా పండగ అంటే ఒక సంబరం లాంటిది..పండగ వచ్చిందంటే చాలు నిర్మాతలు తమ సినిమాలతో థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోతారు..అలా ఈ దీపావళి పండగకి కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి..వాటిల్లో మన తెలుగు సినిమాలు జిన్నా మరియు ఓరి దేవుడా కాగా..తమిళ డబ్బింగ్ సినిమాలైనా ‘సర్దార్’,’ప్రిన్స్’ విడుదలయ్యాయి..ఈ నాలుగు సినిమాలలో ఏది హిట్ మరియు ఏది ఫట్ అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
1). ‘ఓరి దేవుడా’ :

ముందుగా ‘ఓరి దేవుడా’ సినిమా గురించి మాట్లాడుకోవాలి..తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘ఓ మై కడువులే’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై విడుదలకి ముందు నుండే మంచి అంచనాలు ఉన్నాయి..టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం, విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్ర పోషించడం వల్ల ట్రేడ్ లో మంచి బజ్ ని ఏర్పర్చుకుంది ఈ సినిమా..అలా మంచి పాజిటివ్ బజ్ తో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది..సినిమా ప్రారంభం కాస్త స్లో గానే మొదలైనప్పటికీ కూడా కామెడీ సీన్స్ మరియు లీడ్ పెయిర్ నటన బాగుందని..ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయిందని..వీటి అన్నిటితో పాటుగా లియోన్ జేమ్స్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయ్యిందని, ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా అని..బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ సాదిస్తుందని టాక్ వచ్చేసింది.
2.) ప్రిన్స్:

ఇక మనం మాట్లాడుకోవాల్సిన రెండవ సినిమా శివ కార్తికేయన్ హీరో గా నటించిన ‘ప్రిన్స్’ గురించి..జాతి రత్నాలు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన అనుదీప్ నుండి వచ్చిన రెండవ సినిమా ఇది..టీజర్ మరియు ట్రైలర్ కూడా మంచి కామెడీ తో నిండిపోవడం తో భారీ అంచనాల నడుమే ఈ సినిమా ఈరోజు తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలైంది..ఈ చిత్రానికి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది..జాతి రత్నాలు కామెడీ నచ్చిన వాళ్లకి కచ్చితంగా ఈ సినిమా కూడా నచుతుంది..కానీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ కాస్త తగ్గింది కానీ, ఓవరాల్ గా చూసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ తో నిండిన సినిమా గా చెప్పుకోవచ్చు..శివ కార్తికేయన్ కి డాక్టర్ మరియు డాన్ తర్వాత తెలుగు లో ఈ చిత్రం ద్వారా హ్యాట్రిక్ పడిందనే చెప్పొచ్చు.
3.) సర్దార్

ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే తమిళ హీరోలలో ఒకరైన కార్తీ నటించిన ‘సర్దార్’ అనే చిత్రం కూడా ఈరోజే విడుదలైంది..3 గంటల నిడివి ఉన్న సినిమా అయ్యినప్పటికీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం..పోలీస్ ఆఫీసర్ గా మరియు సర్దార్ గా కార్తీ నటన అద్భుతం అనే చెప్పాలి..ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది..కానీ సెకండ్ హాఫ్ మధ్యలో కొద్దిగా లాగ్ అనిపించినా కూడా ఒకసారి ఈ సినిమాని చూసేయొచ్చు..డైరెక్టర్ మిత్రన్ ఆద్యంతం ఈ సినిమాని ప్రేక్షకులు ఉత్కంఠతో చూసే విధంగానే తెరకెక్కించాడు..కమర్షియల్ గా ఈ సినిమా కూడా సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
4.) జిన్నా

సినిమాలో కంటెంట్ లేకుండా భారీ కాస్టింగ్ పెట్టినంత మాత్రాన సినిమా ప్రేక్షకులను అలరించడు అని చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచినా చిత్రం జిన్నా..ఈ సినిమాలో మంచు విష్ణు నటన పరంగా చాలా రోజుల తర్వాత పర్వాలేదు అనిపించాడు కానీ కథలో దమ్ము లెకపొయ్యేసరికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు..సన్నీ లియోన్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా చెప్పుకోవచ్చు..ఇక పాయల్ రాజపుట్ కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయ్యింది..వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా పేలింది..ఎదో టైం పాస్ కి కాసేపు చూద్దాం అనుకున్నోళ్లకు పర్వాలేదు అనిపిస్తుంది కానీ..బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యే రేంజ్ సినిమా అయితే కాదనే చెప్పాలి.