Homeఅంతర్జాతీయంBaglihar Dam: పాకిస్తాన్‌ను భయపెడుతున్న బగ్లిహార్‌ ఆనకట్ట.. అసలేంటిది? చరిత్ర ఇదీ

Baglihar Dam: పాకిస్తాన్‌ను భయపెడుతున్న బగ్లిహార్‌ ఆనకట్ట.. అసలేంటిది? చరిత్ర ఇదీ

Baglihar Dam: 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్‌ మధ్య కుదిరిన సింధు జల ఒప్పందం, సింధు నది, దాని ఉపనదుల నీటి వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, సింధు, జీలం, చీనాబ్‌ నదుల నీటిలో 80% పాకిస్తాన్‌కు, రావి, బియాస్, సట్లెజ్‌ నదుల నీటిని భారత్‌కు కేటాయించారు. అయితే, పహల్గాం దాడి తర్వాత భారత్‌ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో, పాకిస్తాన్‌కు రావాల్సిన నీటిని భారత్‌ మళ్లించే అవకాశం ఉందని పాక్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధానికి సమానమని హెచ్చరించారు, ఇది పాక్‌ ప్రజలకు ఆకలి, దాహాన్ని తెచ్చిపెడుతుందని అన్నారు.

Also Read: పాకిస్థాన్‌పై దాడికి భారత్‌ వ్యూహం.. కీలక స్థావరం గుర్తింపు!

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో చీనాబ్‌ నదిపై 2008లో పూర్తయిన బగ్లిహార్‌ ఆనకట్ట, 900 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 1992లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, నిర్మాణ దశ నుంచే భారత్‌–పాక్‌ మధ్య వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్, ఈ ఆనకట్ట డిజైన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, తమకు రావాల్సిన నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుందని ఆరోపిస్తూ ప్రపంచ బ్యాంకు జోక్యాన్ని కోరింది. ఇటీవల, ఆనకట్ట గేట్లు మూసివేయడంతో పాక్‌ వైపు నీటి ప్రవాహం 90% తగ్గింది. ఈ చర్య రిజర్వాయర్‌లో బురద తొలగించడానికి అవసరమని భారత అధికారులు చెప్పినప్పటికీ, పాకిస్తాన్‌ దీనిని ఒప్పంద ఉల్లంఘనగా భావిస్తోంది.

కిషన్‌గంగా ఆనకట్ట – మరో వివాదాంశం
ఉత్తర కశ్మీర్‌లో జీలం నదిపై నిర్మించిన కిషన్‌గంగా ఆనకట్ట కూడా పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆనకట్ట గేట్లను మూసివేసే ప్రణాళిక ఉన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదించింది. 330 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్, పాకిస్తాన్‌కు నీటి సరఫరాను తగ్గిస్తుందని ఆ దేశం ఆరోపిస్తోంది. ఈ ఆనకట్టపై కూడా ప్రపంచ బ్యాంకు దర్యాప్తు కోరిన పాకిస్తాన్, దీని డిజైన్, నిర్మాణం ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని వాదిస్తోంది.

గేట్ల మూసివేత..
బగ్లిహార్‌ ఆనకట్ట గేట్ల మూసివేతకు రిజర్వాయర్‌లో బురద తొలగించడం, నీట 90% నీటి ప్రవాహం తగ్గడానికి కారణమని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ సాధారణంగా వర్షాకాలంలో (ఆగస్టు–సెప్టెంబర్‌) జరుగుతుందని, అయితే ఈసారి మే నెలలో జరగడం వివాదానికి దారితీసింది. రిజర్వాయర్‌ను నీటితో నింపే ప్రక్రియ కొనసాగుతుందని, ఇది ఆగస్టు తర్వాత కూడా కొనసాగవచ్చని ట్రిబ్యూన్‌ నివేదించింది. ఈ చర్యను పాకిస్తాన్‌ రాజకీయ ఒత్తిడిగా భావిస్తోంది.

భారత్‌ భవిష్యత్‌ ప్రణాళికలు
బగ్లిహార్‌తో పాటు, చీనాబ్‌ నది మరియు దాని ఉపనదులపై పాకల్‌ దుల్‌ (1000 మెగావాట్‌), కిరు (624 మెగావాట్‌), క్వార్‌ (540 మెగావాట్‌), రాట్లే (850 మెగావాట్‌) ప్రాజెక్టులు 2027–28 నాటికి పూర్తవుతాయి. ఈ ప్రాజెక్టులు మొత్తం 3,014 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయని, సంవత్సరానికి 10,541 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను అందిస్తాయని అంచనా. జమ్మూ కశ్మీర్‌లో 18,000 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంలో 11,823 మెగావాట్లు చీనాబ్‌ బేసిన్‌ నుంచి వస్తాయి. ఈ ప్రాజెక్టులను పాకిస్తాన్‌ వ్యతిరేకిస్తూ, వీటి డిజైన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తోంది.

పాకిస్తాన్‌ భయాలు, భవిష్యత్‌ సవాళ్లు
పాకిస్తాన్, బగ్లిహార్‌ మరియు ఇతర ఆనకట్టల వల్ల తమకు నీటి కొరత ఏర్పడుతుందని, ఇది వ్యవసాయం, గహ వినియోగం మరియు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతోంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించే శక్తి భారత్‌ చేతిలో ఉందని, అదనపు నీటిని విడుదల చేయడం లేదా ఆపడం ద్వారా భారత్‌ పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ వివాదం రాజకీయ, దౌత్యపరమైన సంక్షోభంగా మారే అవకాశం ఉంది, ప్రపంచ బ్యాంకు జోక్యం లేకుండా పరిష్కారం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఐపీఎల్ లో అతడి దూకుడు వెనుక నాన్న.. కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తున్న క్రికెటర్ స్టోరీ..

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular