baby-farming: నైజీరియాలో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లలనే బలవంతంగా తల్లులుగా మార్చేస్తున్నారు. వారి ప్రమేయం లేకున్నా వారిని వేధిస్తూ తల్లులుగా మార్చేస్తున్నారు. ఇదో రకం వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ప్రపంచంలో అన్నింటికి ఖరీదు కట్టే పనిలో భాగంగా పిల్లలను తల్లులుగా మార్చే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. పైగా దీనిపై ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

పట్టుమని పదిహేడేళ్లు కూడా లేని పిల్లలను వారి ఇష్టం లేకుండా తల్లులుగా చేస్తున్నారు. వారికి పుట్టిన పిల్లలను పిల్లలు లేని వారికి అధిక ధరలకు విక్రయిస్తూ ఇదో వ్యాపారంగా చేసుకున్నారు. దీంతో దేశంలో ఇదో రకమైన వ్యాపారంగా మారిపోయింది. కానీ పిల్లల పాలిట శాపంగా మారుతోంది. నిరంతరం వారిని వేధింపులకు గురిచేస్తూ పిల్లలను కనిచ్చే యంత్రాలుగా మారుస్తుండటం ఆందోళనకరమే.
Also Read: పిల్లల కడుపులో పురుగులు అట.. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండలాంటే ఇలా చేయండి !
నైజీరియాలో గర్భస్రావాలు నేరం. ఇదే అదనుగా భావించిన వారు పిల్లలు కనిపించేందుకు ఉపయోగించుకుంటున్నారు. బేబీ పార్మింగ్ వ్యాపారం ఒక్క నైజీరియాలోనే కాదు చాలా దేశాల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. దీంతో బాలికల జీవితాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వారికి అనుకూలంగా మార్చుకుని బాలికలను మాత్రం ఇబ్బందులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో నైజీరియాలో కొనసాగుతున్న వ్యాపారంపై ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా అవుతోంది. బాలికలను భారంగా మార్చేస్తోంది. కనీస వయసు లేకుండా వారికి ఇష్టం లేకున్నా తల్లులుగా చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో వారిలో ఆగ్రహం వస్తున్నా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ సంస్కృతి ఎప్పటికి పోతుందో అని బాలికల్లో అసహనం పెరుగుతోంది.
Also Read: ఏపీలో ఎటూ తేలని PRC పంచాయితీ.. సీఎంవో చుట్టూ ఉద్యోగ సంఘాల ప్రదక్షిణలు