https://oktelugu.com/

Allu Arjun: బన్నీని టచ్ చేయడం పవన్ కి కూడా కష్టమే… కానీ చరణ్ కి కాదు!

Allu Arjun: గత రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఇమేజ్ మార్చివేశాయి. అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ ని రెండు వందల క్లబ్ లో చేర్చిన అల వైకుంఠపురంలో బన్నీ స్టామినా ఏమిటో నిరూపించింది. తెలుగు,మలయాళ భాషల్లో మాత్రమే విడుదలైన అల వైకుంఠపురంలో మూవీ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 14, 2022 / 12:42 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: గత రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఇమేజ్ మార్చివేశాయి. అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ ని రెండు వందల క్లబ్ లో చేర్చిన అల వైకుంఠపురంలో బన్నీ స్టామినా ఏమిటో నిరూపించింది. తెలుగు,మలయాళ భాషల్లో మాత్రమే విడుదలైన అల వైకుంఠపురంలో మూవీ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ సాంగ్స్ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో నేషనల్ వైడ్ గా సందడి చేశాయి.

    Allu Arjun

    అల వైకుంఠపురంలో మూవీ విజయంతో అల్లు అర్జున్ ఆలోచనా విధానం మారిపోయింది. ఏకంగా పాన్ ఇండియా హీరోగా ప్రధాన భాషల్లో మార్కెట్ తెచ్చుకోవాలని ప్లాన్ వేశారు. అందుకే లోకల్ మూవీగా మొదలైన పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా మార్చారు. దర్శకుడు సుకుమార్ కథను పెంచి రెండు భాగాలుగా పుష్ప చిత్రాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ నమ్మకం వమ్ము కాలేదు. పుష్ప భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

    Also Read: పిల్లల కడుపులో పురుగులు అట.. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండలాంటే ఇలా చేయండి !

    ముఖ్యంగా హిందీ వర్షన్ రూ. 81 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దారుణమైన ఓపెనింగ్స్ తో మొదలైన పుష్ప హిందీ బాక్సాఫీస్ జర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. బాలీవుడ్ ప్రముఖులు పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. హిందీ బెల్ట్ లో అల్లు అర్జున్ నెగ్గుకురాగలడని పుష్ప ఆత్మవిశ్వాసం కలిగించింది. ఇక టాలీవుడ్ పరంగా పుష్ప టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

    ప్రభాస్ బాహుబలి, బాహుబలి2, సాహో చిత్రాల తర్వాత థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా పుష్ప నిలిచింది.కాగా మెగా హీరోలలో ప్రస్తుతానికి బన్నీ రికార్డ్స్ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. చివరకు పవన్ కళ్యాణ్ కి సైతం పుష్ప కలెక్టన్స్ రికార్డ్స్ టచ్ చేయడం కష్టమే. మెగా ఫ్యామిలీ నుండి అత్యధిక ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన నెక్స్ట్ మూవీ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

    భీమ్లా నాయక్ ఒక్క తెలుగులో మాత్రమే విడుదలవుతున్న విషయం తెలిసిందే, కాబట్టి భీమ్లా నాయక్ అల వైకుంఠపురంలో కలెక్టన్స్ దాటే అవకాశం కలదు. కానీ పుష్ప రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యమే. అయితే పవన్ కూడా హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే అల్లు అర్జున్ పుష్ప వసూళ్లను బ్రేక్ చేయడం సాధ్యమవుతుంది. కానీ ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్ బన్నీకి చెక్ పెట్టడం ఖాయం. ఎన్టీఆర్ తో ఆయన చేస్తున్న ఈ మల్టీస్టారర్ సులభంగా పుష్ప వసూళ్లను దాటివేస్తుదనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికైతే మెగా ఫ్యామిలీ నుండి రెండు టాప్ గ్రాసింగ్ చిత్రాలతో అల్లు అర్జున్ ముందంజలో ఉన్నారు.

    Also Read: ఏపీలో ఎటూ తేలని PRC పంచాయితీ.. సీఎంవో చుట్టూ ఉద్యోగ సంఘాల ప్రదక్షిణలు

    Tags