AP CM Jagan: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. భోగి సందర్భంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా జగన్ వస్త్రధారణ ఉంది. ఆయన తన సతీమణి భారతితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇకపోతే సీఎం నివాసం అయిన తాడేపల్లిలోని గోశాలలో సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే జగన్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి.. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబురాలతో ప్రతీ ఇంట ఆనందాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Also Read: బన్నీని టచ్ చేయడం పవన్ కి కూడా కష్టమే… కానీ చరణ్ కి కాదు!
ఇకపోతే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కారంచేడులో భోగి జరుపుకున్నారు. ఆయనతో పాటు కుటుంబమంతా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరితో కలిసి భోగి మంటల వద్ద ముచ్చటించుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం గతేడాది డిసెంబర్ 2న సూపర్ సక్సెస్ అయింది. ఇక బాలయ్య ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’లో.. ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే ’షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు.
వరుసగా టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలను తన షో లో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు బాలయ్య. ఈ షోకు ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి, కీరవాణి, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రానా హాజరయ్యారు. ఇటీవల డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ‘లైగర్’ హీరో .. విజయ్ దేవరకొండ, చార్మి హాజరయ్యారు. వైసీపీ కీలక నేత, సత్తనెపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సత్తెనపల్లిలో భోగి జరుపుకున్నారు. భోగి మంటల వద్ద లంబాడీ మహిళలతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read: మందు బాబులకు అలెర్ట్.. రోజూ మద్యం తాగితే ఎంత డేంజరో తెలుసా..?