BRS: కేంద్రంలో రెండవ దఫా బిజెపి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని పూర్తి చేసుకోబోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని అనుభవించిన భారత రాష్ట్ర సమితి మూడవసారి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించింది.. ఇక ఇప్పట్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు భారత రాష్ట్ర సమితికి లేనట్టే. మహారాష్ట్రలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా లేనట్టే.. ఇక భారతీయ జనతా పార్టీకి సైతం తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. మరి గొప్ప మెజారిటీ అని కాదు కానీ.. 64 సీట్లతో మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. పార్టీ ఓడిపోయిన బాధలో రకరకాల మీమ్స్ రూపొందిస్తున్నారు. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గానీ.. ఆ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ ఉండాలని రకరకాల రూపాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు వీడియోలు రూపొందించారు.. ఇప్పుడు ఆ విషయం మర్చిపోకముందే మరొక విధంగా వీడియోలు రూపొందిస్తున్నారు.
బాహుబలి సినిమాతో..
బాహుబలి లో.. ప్రభాస్ ను కట్టప్ప చంపే సీన్ ఒకటి ఉంటుంది.. ఈ సీనే సినిమాకు హైలెట్.. అయితే బిజ్జల దేవ, భల్లాలదేవ చేసిన విష ప్రచారాన్ని శివగామి నిజం అని నమ్ముతుంది. అలా ఆమె ప్రభాస్ ను చంపమని కట్టప్పను ఆదేశిస్తుంది. రాజమాత చెప్పడంతో కట్టప్ప కూడా అలాగే చేస్తాడు. ఫలితంగా ప్రభాస్ చనిపోతాడు. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. సోషల్ మీడియాలో ఏకంగా ఒక వీడియోనే రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు పై ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నారు. దీనిపై ఎలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వారు పెద్దగా లెక్కచేయడం లేదు. ఇప్పటికీ తమ ముఖ్యమంత్రిగా వారు కేసీఆర్ ను భావిస్తుండడం విశేషం.
ఏం చెబుతున్నారంటే..
బాహుబలి సినిమాలో లాగా ఆ వీడియో లో ప్రభాస్ ను కెసిఆర్ తో పోల్చారు.. కట్టప్పను తెలంగాణ ఓటర్లుగా పరిగణించారు. వెనుక ఉన్న భల్లాలదేవ, బిజ్జల దేవ ను రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులుగా పోల్చారు. వారు చేసిన విష ప్రచారం వల్లే కట్టప్ప రూపంలో ఉన్న తెలంగాణ ఓటర్లు ప్రభాస్ రూపంలో ఉన్న కేసీఆర్ ను ఓడించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి విష ప్రచారం వల్లే తెలంగాణ ఓటర్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించారని భారత రాష్ట్ర సమితి నాయకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిజమే కదా!..
విషప్రచారాలు…
జనం నమ్మడం వల్ల కేంద్రంలో బీజేపీ,
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది!.. pic.twitter.com/mFuOASn0BK— Madhuri madhu (@Lovemadhu143) December 7, 2023