https://oktelugu.com/

హైదరాబాద్ లో కూర్చుంటే ఎలా బాబు? షాకిచ్చిన అయ్యన్న 

‘ఇలాగైతే తెలుగుదేశం పార్టీ ఎవరూ బతికించలేరు. కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారు.? ప్రజలు ఏమనుకుంటారు. పార్టీ ఆఫీసుకు తాళం వేసి హైదరాబాద్ వెళ్లిపోతే ఎలా’ అని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అధినేత చంద్రబాబుపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.  హైదరాబాద్లోనే చంద్రబాబు ఎక్కువగా గడుపుతున్నారని.. ఎప్పుడైనా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని.. ఇలా చేయడం సరికాదని అయ్యన్న కుండబద్దలు కొట్టాడట.. ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్ లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 09:32 AM IST

    ayyana patrudu shock to babu

    Follow us on


    ‘ఇలాగైతే తెలుగుదేశం పార్టీ ఎవరూ బతికించలేరు. కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారు.? ప్రజలు ఏమనుకుంటారు. పార్టీ ఆఫీసుకు తాళం వేసి హైదరాబాద్ వెళ్లిపోతే ఎలా’ అని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అధినేత చంద్రబాబుపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.  హైదరాబాద్లోనే చంద్రబాబు ఎక్కువగా గడుపుతున్నారని.. ఎప్పుడైనా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని.. ఇలా చేయడం సరికాదని అయ్యన్న కుండబద్దలు కొట్టాడట.. ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్ లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారట.

    Also Read: బాబుకు కలిసిరాని వాస్తు.. జగన్ కు కలిసొస్తుందా?

    మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు బాబుకు షాకిచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవిప్పుడు టీడీపీని కుదిపేస్తున్నాయి. అయ్యన్న వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. .

    టీడీపీలో కొందరు ప్రచారం కోసమే పనిచేస్తున్నారని వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదని అయ్యన్న కుండబద్దలు కొట్టాడట.. పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్ లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించినట్టు తెలిస్తోంది. ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరని కాస్త ఘాటుగానే చెప్పారట..

    చంద్రబాబు తీరును అయ్యన్న పాత్రుడు తీవ్రంగా తప్పుపట్టినట్టు సమాచారం. పార్టీలో బలోపేతంపై ఫోకస్ పెట్టకుండా జూమ్ లో ఆన్ లైన్లో ప్రెస్ మీట్లతో పార్టీ బాగుపడదని అయ్యన్న హితవు పలికారట.. నాలుగురోజుల క్రితం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారట.. ఈ క్రమంలోనే అయ్యన్న తన అసంతృప్తిని వెళ్లగక్కాడట.

    Also Read: సామాజిక, మతపరమైన విద్యా అసమానతలు

    కాగా అయ్యన్న వ్యాఖ్యలతో అలెర్ట్ అయిన చంద్రబాబు,  పార్టీ నేతలు కూడా ఒకింత షాకయ్యారని తెలిసింది. అందుకే చంద్రబాబు లోకేష్ ను హైదరాబాద్ నుంచి ఏపీకి పంపించారని సమాచారం. దీనిపై టీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.