https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సక్సెస్ దానిమీదే ఆశ

  నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది..’ అని పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ నేటికి పవన్ ఫ్యాన్స్ ను ఉర్రుతలూగిస్తూనే ఉంది. దర్శకుడు హరీష్ శంకర్-పవర్ స్టార్ కాంబినేషన్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ ఇద్దరి కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. Also Read: అఖిల్ మీద 70 కోట్లు అంటే.. కష్టమే ! ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 10:36 AM IST

    pawankalyan

    Follow us on

      నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది..’ అని పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ నేటికి పవన్ ఫ్యాన్స్ ను ఉర్రుతలూగిస్తూనే ఉంది. దర్శకుడు హరీష్ శంకర్-పవర్ స్టార్ కాంబినేషన్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ ఇద్దరి కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

    Also Read: అఖిల్ మీద 70 కోట్లు అంటే.. కష్టమే !

    ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడింది. ఇటీవల పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తయినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ ‘వకీల్ సాబ్’ మూవీని తెరకెక్కిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    పవన్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న ‘వకీల్ సాబ్’ కోసం పవన్ ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే కూడా పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్-పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న #PSPK 28 మూవీపైనే అంచనాలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత హిట్టయిందో తెల్సిందే. అంతేకాక హరీష్ శంకర్ పవన్ అభిమాని కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: ఏడుపులు తగలెయ్యా.. ట్రోల్స్ దెబ్బకు.. వామ్మో అంటున్న ‘బిగ్ బాస్’

    ఈ సినిమాతోపాటు పవన్-క్రిష్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. పవన్ తొలిసారి పీరియాడికల్ మూవీ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాపై కూడా పవన్ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. దీంతోపాటు ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో ఓ సినిమా చేయనున్నారు. సురేందర్ రెడ్డి తన సినిమాల్లోని హీరోలను చాలా స్టైలీష్ చూపిస్తుంటాడు. దీంతో పవన్ కల్యాణ్ ను దర్శకుడు ఎలా చూపిస్తాడోనని చర్చించుకుంటున్నారు. పవర్ స్టార్ చేస్తున్న నాలుగు సినిమాలపై పవన్ ఫ్యాన్స్ ఎవరికీ వారు లెక్కలేసుకుంటుండటం గమనార్హం.