Gandhi Hospital: పంచ పాండవలంటే నాకు తెలియదా మంచొ కోళ్ల లెక్క నలుగురు ఉంటారని మూడే వేళ్లు చూపించాడట అలా ఉంది వ్యవహారం. మన ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా మారుతోంది. మంత్రులు మారినా ఆయా శాఖల పేర్లు మాత్రం మారడం లేదు. ఫలితంగా అపవాదును మూటగట్టుకుంటున్నారు. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే ధోరణిలో ప్రభుత్వ వ్యవహారం ఉంటోంది. దీనిపై ఎవరు కూడా నోరు మెదపకపోవడం విచారకరం. ఇంతవరకు కూడా దాన్ని మార్చాలనే ఆలోచన కూడా రాకపోవడం విడ్డూరమే.
Gandhi Hospital
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పక్కకు జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. అయినా గాంధీ ఆస్పత్రి యాజమాన్యం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. తన అధికారిక వెబ్ సైట్లో మంత్రిగా ఈటల రాజేందర్ పేరునే కొనసాగించడం విమర్శలకు దారి తీస్తోంది. అసలు మంత్రి ఎవరనే విషయంపై సిబ్బందికి స్పష్టత లేదా? లేక నిర్లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారా? అదేది తేలాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఈటల రాజేందర్ పేరునే కొనసాగించడం వెనుక అసలు విషయం ఏమై ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయి.
Also Read: Husband And Wife Relation: పెళ్ళాన్ని నలుగురిలో పేరు పెట్టి పిలవచ్చా? పిలవకూడదా?
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తో విభేదాల కారణంగా టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి మంత్రిపదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైనా మంత్రిగా ఆయన పేరునే ఉంచడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి ఇష్టం లేకనేనా లేక ఈటల రాజేందర్ పేరును తీసేయకూడదని నిర్ణయించుకున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Gandhi Hospital
వైద్యసేవలు ఎలాగూ సరిగా చేయరు అనే విమర్శలున్నా అధికారిక వెబ్ సైట్ ను సైతం సరిగా నిర్వహించరా? అనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. మంత్రి మారడంతో కొద్ది రోజులు ఆ శాఖ సీఎం వద్దే ఉంది. తరువాత హరీష్ రావు కు బాధ్యతలు అప్పగించారు. కానీ అవేవీ లేకుండా ఈటల పేరునే కొనసాగించడం వెనుక మతలబు ఏమిటని అడుగుతున్నారు. దీనికి గాంధీ సిబ్బంది ఏం సమాధానం చెబుతారో అని ఎదురుచూస్తున్నారు.
ఇంకా ఇతర సిబ్బంది పేర్లు కూడా మార్చలేదు. దీంతో గాంధీ ఆస్పత్రి సిబ్బంది పనిచేస్తున్నారా? లేక కాలక్షేపం చేస్తున్నారా అనేది తెలియడం లేదు. దీంతో వారిలో క్రమశిక్షణ రాహిత్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎందులోనైనా తప్పు జరగొచ్చు కానీ వైద్యంలో తప్పు జరిగితే అంతే అని తెలిసినా వారిలో ఎంతమాత్రం విధుల్లో అప్రమత్తత కనిపించడం లేదు. మొత్తానికి ఈ వ్యవహారంపై ఏం జవాబు చెబుతారో అని అందరు ఉత్కంఠగా చూస్తున్నారు.
Also Read:KCR New Plan: అంతుచిక్కని కేసీఆర్ కొత్త ప్లాన్.. ఏం చేయబోతున్నారు?