
Attack on a young woman: మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సభ్య సమాజంలో ఆడవాళ్లకు కనీస మర్యాద దక్కడం లేదు. మర్యాదే కాదు.. వారి మాన, ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోతున్న దైన్యం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ 30 ఏళ్ల దుర్మార్గుడు అత్యాచారం హత్య చేసిన వైనం మరిచిపోకముందే మరో దారుణం జరిగింది. ఈసారి ఏపీలో మిట్టమధ్యాహ్నం ఓ ఆడకూతురును ఒంటరిగా తీసుకెళ్లి చావబాది, నాతో, నా ఫ్రెండ్ తో పడుకోవాలని ఓ కీచకుడు కొడుతున్న వీడియో తాజాగా ఏపీలో కలకలం రేపుతోంది.
యువతిపై విచక్షణా రహితంగా చేత్తో, కర్రతో దాడి చేశాడు దుండగుడు. దీన్ని తన స్నేహితుడితో కలిసి వీడియో కూడా తీసిన వైనం విస్తుగొలుపుతోంది. కొట్టవద్దు అని బ్రతిమిలాడుతున్నా కూడా ఆ యువతిని కనికరించని ఆ దుర్మార్గుడు పైశాచికత్వం వీడియోలో చూసి అందరూ రగిలిపోతున్న పరిస్థితి నెలకొంది.
ప్రక్కన ఉన్న మరో వ్యక్తితో పడుకోవాలని దాడి చేస్తున్న వైనం చూసి అందరూ విస్తుపోతున్నారు. నా వల్ల కాదు అని ఆ యువతి తిమిలాడుతున్న కనికరించని పరిస్థితి నెలకొంది.
దాదాపు 10 దెబ్బలు కర్రతో, చేత్తో 4 దెబ్బలు కొడుతూ వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని.. తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజలు కోరుతున్నారు..
చేతి గాజులు పగిలి రక్తం కారుతున్న కనికరించని ఆ మానవ మృగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.