biryani : బ్రిడ్జ్ కింద ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ మృతదేహం గత సంవత్సరం అంటే 2023 జనవరి 12.. మడకశిరలోని కోడిగానిపల్లి సమీపంలో ఉన్న హంద్రీనివా వద్ద లభించింది. ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి చనిపోయి కనిపించాడు. ఆ బాడీని చూస్తే ఎవరో కావాలని చంపి అక్కడ పడేసారని క్లియర్ గా అర్థం అయిందట. కానీ అతను ఎవరు? ఎక్కడ ఉంటాడు? వంటి విషయాలు కనుక్కోడానికి ఎలాంటి క్లూ లేదు. క్లూ లేదని అని పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయలేదు. దాదాపు రెండు సంవత్సరాలు ఈ కేసు కోసం చాలా కష్టపడ్డారు.
కట్ చేస్తే చివరకు నిందుతులను పట్టుకున్నారు. అదెలా అని అనుకుంటున్నారా? ఈ మడకశిరలో మృతదేహం కనిపించిన తర్వాత ఆధారాల గురించి కాకుండా మిస్సింగ్ కేసులను వెతకారు పోలీసులు. అన్ని ప్రాంతాల్లో కేసులు పరిశీలించారు అదే సమయంలో కర్నాటకలోని తుమకూరులో పెండింగ్‌లో ఉన్న ఓ మిస్సింగ్ కేసును వీరి కంట పడింది. వెంటనే ఆ వ్యక్తి కుటుంబానికి మడకశిరలో దొరికిన డెడ్‌బాడీ ఫొటోలు పంపిచారు. ఆ డెడ్ బాడీ వారి మనిషే అని తెలియడంతో అక్కడి కేసు నుంచి దర్యాప్తు మొదలు పెట్టారు.
మరణించిన వ్యక్తి పేరు మోహన్ కుమార్. అయితే కుటుంబంలో గొడవల వల్ల భార్య కవితకు దూరంగా ఉంటున్నాడు ఈయన. అతని భార్య తన కొడుకు కౌశిక్, కూతురుతో కలిసి వేరే చోట ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు అనుమానం రావడంతో మోహన్ భార్యను అరెస్ట్ చేశారు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఏం జరిగిందని విచారించారు. అంతే మర్డర్ వెనక ఉన్న రహస్యం వీడింది. మోహన్ భార్య కవితకు తన ఆఫీస్‌లోనే పని చేస్తున్న అక్తర్ పాషా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అక్తర్, కవిత ఇద్దరు ఓ హోటల్ ను రన్ చేస్తున్నారు కూడా. అక్కడికి అప్పుడప్పుడు మోహన్ వచ్చి గొడవ చేసేవాడు. తనకు అన్యాయం చేశావంటూ కవితను చాలా తిట్టేవాడు. రీసెంట్‌గా గొడవకు వెళ్లిన సమయంలో.. తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా కవితకు గానీ పిల్లలకు గానీ ఇవ్వను అని తేల్చి చెప్పాడు.
కోపంతో మోహన్‌ను చంపేయాలని కవిత నిర్ణయం తీసుకుంది. కూతురికి ఒంట్లో బాగాలేదని మోహన్ ను నమ్మించింది కవిత. ఈ సాకుతో భర్తను ఇంటికి పిలించింది కవిత. ఇంట్లోనే తినాలని ఆయనకు బిర్యానీ పెట్టింది. ముందే వంట మనిషికి డబ్బులు ఇచ్చి ఆ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపింది కవిత. నిద్రలోకి జారుకున్న మోహన్ కుమార్‌ను భార్య, కొడుకు, ప్రియుడు అక్తర్, వంట మనిషి అందరూ కలిసి చంపేశారు. ఆ తర్వాత బాడీని కారులో తీసుకొని వచ్చి హంద్రీనివా కాలువలో పడేశారు. అక్కడి నుంచి బాడీ ప్రవాహానికి కొట్టుకువచ్చి బ్రిడ్జ్ కింద చిక్కుకుంది. నిజాలు తెలిసిన తర్వాత పోలీసులు నిందితులను హత్యకు ఉపయోగించిన కారు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా తేలడానికి ఏకంగా రెండేళ్లు పట్టింది.