Deputy CM Pawan kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ‘పుష్ప 2’ చిత్రం విడుదల ముందు రోజు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్ కి విచ్చేశాడు. ఆ సమయంలో అక్కడ అసంఖ్యాకంగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసిలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం శోచనీయంగా మారగా, అల్లు అర్జున్ పై ఆమె భర్త భాస్కర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ మరియు థియేటర్ యాజమాన్యంపై FIR నమోదు చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం థియేటర్ ఓనర్స్ ని అరెస్ట్ చేయగా, నేడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి నాంపల్లి హై కోర్టు లో హాజరు పరిచారు. ఈ కేసు పై విచారణ జరిపిన హై కోర్టు, అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది.
దీంతో అల్లు అర్జున్ ని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. ఇదంతా పక్కన పెడితే ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ కూడా కాసేపటి క్రితమే హైదరాబాద్ కి విజయవాడ నుండి బయలుదేరాడు. నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ ని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం లో భారీ సభని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి హోదా లో పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగం ఇచ్చి, ఆ తర్వాత చంద్ర బాబు నాయుడు పక్కన కూర్చోగా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు.
దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయాన్ని చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ అవునా, నిజమా అని స్పందించినట్టు ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం వంటివి జరిగినట్టు అభిమానులు సోషల్ మీడియా లో ఈ వీడియో ని పోస్ట్ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అరెస్ట్ పై తీవ్రమైన నిరసన వ్యక్తం చేసారు. ఇందులో కేవలం అల్లు అర్జున్ పొరపాటు మాత్రమే కాదు, పోలీసుల పొరపాటు కూడా ఉంది, కానీ ఒక్కడిని బలి చేయడం కరెక్ట్ కాదు, ఈ వ్యవహారం చూస్తుంటే అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి కావాలని కక్ష్య తీర్చుకున్నట్టు ఉందని అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబాదుతూ తీవ్ర స్థాయిలో స్పందించే అవకాశం ఉందని కూడా ఆయన అభిమానులు అంటున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఉన్న పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారంట అని చెప్పిన బాబు గారు షాక్ కు గురైన పవన్…#AlluArjun #AlluArjunArrest pic.twitter.com/ZE9fOWP7o4
— Nikhil_Prince (@Nikhil_Prince01) December 13, 2024