Akhanda 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సీనియర్ హీరో బాలయ్య బాబు…ఇప్పుడు బోయపాటితో చేస్తున్న అఖండ 2 సినిమాతో కూడా మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా ఆయన సినిమాలు తీసే స్పీడ్ కూడా పెంచాడనే చెప్పాలి…
బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టు గా నిలిచిన విషయం మందకు తెలిసిందే…ఇక ఇప్పుడు ఎట్టకేలకు అఖండ 2 సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తొందరగా షూట్ స్టార్ట్ చేసుకొని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి ఒక నటుడు ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్య అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాయి. మరి ఇప్పుడు వీళ్ళ కాంబోలో 4 వ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించి వీళ్ళ కాంబినేషన్ కి మరింత బలాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు తన తదుపరి సినిమాలను కూడా లైన్ లో పెట్టే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలయ్య బాబు బోయపాటి మీదే ఎక్కువ ప్రెజర్ ని పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే ఈ సినిమాని వీలైనంత తొందరగా ఫినిష్ చేస్తే తను తదుపరి సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందట.
అందువల్లే బోయపాటిని ఎక్కువ రోజులు సినిమా కోసం టైం తీసుకోకుండా చాలా తొందరగా సినిమాని ఫినిష్ చేయాలని బాలయ్య ముందే కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం అటు బాలయ్య కి, ఇటు బోయపాటికి మంచి గుర్తింపు వస్తుంది.
ఇప్పటికే అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. మరి అఖండ 2 గా వస్తున్న ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా బాలయ్య బాబు తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇప్పటికే బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో డాకు మహారాజు సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే బాలయ్య వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వాడు అవుతాడు…