https://oktelugu.com/

ఆత్మనిర్భర్.. భారత్ సాధించిన ఘనత ఇదీ

కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది. అందులోనూ.. కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంపైనే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి రూ.35 వేల కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల కోట్లతో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులను […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 01:18 PM IST
    Follow us on


    కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది. అందులోనూ.. కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంపైనే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి రూ.35 వేల కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల కోట్లతో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులను కేటాయించడానికి వెనుకాడబోమని తెలిపారు.

    Also Read: ప్రభుత్వ సంస్థలకు మంగళం.. ప్రైవేటీకరణకు బీజేపీ సర్కార్ అందలం..

    ఆత్మనిర్భర్ భారత్ కింద దేశం సొంతంగా రెండు కరోనా వ్యాక్సిన్లను రూపొందించిందని గుర్తు చేశారు. మరో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాబోతోన్నాయని తెలిపారు. దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్లను వందకు పైగా విదేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఇది సాధ్యపడిందని అన్నారు. సకాలంలో వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించగలిగామని, ఫలితంగా అత్యంత తక్కువ శాతం మరణాలను నమోదు చేసిన దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులను అవకాశంగా మార్చుకోవడంలో విజయం సాధించామని అన్నారు.

    Also Read: కరోనా వ్యాక్సిన్ కోసం రూ.33 వేల కోట్లు

    వైద్య రంగానికి 2.23 లక్షల కోట్ల రూపాయలను కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. ఈ మొత్తాన్ని రెట్టింపు చేశామని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 94,452 లక్షల కోట్ల రూపాయలను కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 2.23 లక్షల కోట్ల రూపాయలకు పెంచామని చెప్పారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఈ నిధులను ఇదివరకటితో పోల్చుకుంటే ఈ మొత్తం 137 శాతం అధికమని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా బడ్జెట్‌ను కేటాయిస్తామని చెప్పారు. ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ల కోసం 35 వేల కోట్ల రూపాయలు చాలవని అనుకుంటే.. మరింత నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లే అర్థమవుతోంది.