Telangana Opinion Poll: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో నేతలు నామినేషన్ల పనిలో బిజీగా ఉన్నారు. నామినేషన్ వేసిన వారు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అయితే ఈసమయంలో అనేక సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలను ఇప్పటికే అంచనా వేశాయి. కొన్ని ఇంకా అంచనా వేసే పనిలో ఉన్నాయి. ఒపీయిన్ పోల్, ప్రీపోల్ సర్వేలు ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ఇచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ ఆస్ట్రాలజిస్టు చెప్పిన లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆసక్తి చేపుతోంది.
ప్రముఖ ఆస్ట్రాలజిస్టు..
తెలంగాణలో సెంటిమెంటు రాజకీయాలు ఎక్కువ. ఓటరు ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినడు అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉంది. ఈసారి సర్వే సంస్థలు కాంగ్రెస్‌కు కాస్త ఎడ్జ్ ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం వస్తుందని చెబుతున్నాయి. కానీ, తెలంగాణలో చాలా మంది నేతలు జోతిష్యాన్ని నమ్ముతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అయితే ఈనమ్మకం చాలా ఎక్కువ. అందుకే ఆయన ప్రతీ ఎన్నికల సమయంలో రాజశ్యామల యాగం కూడా చేస్తున్నారు. తనకు కలిసి వచ్చే నంబర్ రోజు ఎన్నికలు, నామనినేషన్లు, మేనిఫెస్టో, అభ్యర్థుల ప్రకటన ఉండేలా చూసుకున్నారు. ఈసారి కూడా యాంగా చేశారు. కానీ ఎన్నికల తేదీ కలిసి రాలేదు. దీంతో ఈసారి కేసీఆర్‌కు పరాభవం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈతరుణంలో తాజగా ఆస్ట్రాలజీ లెక్క ఆసక్తికరంగా మారింది.
జోతిష్యం లెక్క ఇలా..
తెలంగాణలో ఆ ప్రముఖ ఆస్ట్రాలజిసు చెప్పిన లెక్క ప్రకారం ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారాయి. అధికార బీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో 49–53 స్థానాలు, కాంగ్రెస్ 38–68 స్థానాలు, బీజేపీ 19–26 స్థానాలు, ఎంఐఎంకు 6–7 స్థానాలు వస్తాయని ఆయన అంచనా వేశారు. ఇందుకు ఆయన ఆస్ట్రాలజీ లెక్కల ప్రకారం అంచనా వేశారు. అయితే ఆయన ప్రముఖ ఆస్ట్రాలజిస్టు కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ లెక్క నిజమవుతుందో కాదో తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాలి. అయితే ఇవి నిజమైతే తెలంగాణలో తొలిసారి సంకీర్ణ సర్కార్ ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం బీఆర్‌ఎస్–ఎంఐఎం కలిసి సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదీ కాకుంటే బీఆర్‌ఎస్–బీజేపీ, లేదా బీఆర్‌ఎస్–కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.