Assembly Election Results 2022: దేశంలో సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు గెలవబోతోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోని పంజాబ్ ను ఆమ్ ఆద్మీ హస్తగతం చేసుకుంటోంది. దేశంలో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీపై విరుచుకుపడడానికి ప్రాంతీయ పార్టీల నేతలంతా కాచుకూర్చున్నారు.కానీ అదేం జరగలేదు. మళ్లీ బీజేపీనే దేశంలో అధికారంలోకి వస్తుందని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తేలబోతోంది.

2024లోనూ బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా అది ఏపీ రాజకీయాలకు శరాఘాతమే అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ సుస్థిరప్రభుత్వం ఏర్పడితే జగన్ ఆశించిన ప్రయోజనాలు ఏపీకి దక్కే అవకాశాలు లేవు. ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల విడుదల విషయంలో బీజేపీ దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. జగన్ ఎదిరించడానికి అవకాశమే ఉండదు. కేవలం బీజేపీకి ఫేవర్ గా అణిగి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. బీజేపీతో సానుకూలంగానే వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్ బీజేపీతో దోస్తీతోనే వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం జగన్ చేతిలోని ఎంపీ సీట్లు కీలకంగా మారి బీజేపీని ఓ ఆట ఆడించేవారు.. ఏపీకి కావాల్సిన నిధులు, హోదా సహా అన్ని సమకూర్చుకునే వారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయేలా ఉంది.
Also Read: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు: ఏపీ, తెలంగాణలో బీజేపీకి ఊపునిస్తుందా?

ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి బీజేపీ గెలుపు శరాఘాతంగా మారింది. ఇఫ్పటికే 2019 సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు సపోర్టు చేసి చంద్రబాబు చేతులు కాల్చుకున్నాడు. బీజేపీని ఎదురించి దారుణంగా ఏపీలో ఓడిపోయారు. ఆ గుణపాఠంతో ఇప్పుడు బీజేపీతో కాళ్ల బేరానికి పోయి నలుగురు ఎంపీలను ఆ పార్టీలోకి సాగనంపారన్న విమర్శలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు సైతం బీజేపీపై కక్కలేక మింగలేక మౌనంగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పుడు ఏపీలో జనసేన-బీజేపీతో చంద్రబాబు తప్పక పొత్తు పెట్టుకొని ముందుకెళ్లే పరిస్థితులే ఉన్నాయి.లేకుంటే సొంతగా జగన్ ను ఎదురించే గెలిచే అవకాశాలు అయితే లేవు. బీజేపీతో పొత్తుతోనే చంద్రబాబు సాగాల్సిన పరిస్థితులున్నాయి. ఇది జనసేన, బీజేపీకి కొండంత బలమవుతుంది. పరిస్థితులు అనుకూలిస్తే జగన్ ను ఈ కూటమి ఓడించే అవకాశాలు ఉంటాయి. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
Also Read: కేంద్రం కూడా అమరావతి విషయంలో బుక్కైనట్టేనా?