Surya ET Movie Review: నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సూరి, సత్యరాజ్, శరణ్య, సిబి భువన చంద్రన్, ఎం ఎస్ భాస్కర్, దేవదర్శిని
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సంగీత దర్శకుడు: ఇమన్
సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
ఎడిటర్ : రూబెన్
తమిళ స్టార్ హీరో సూర్య – ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సూర్య ఇటి. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం
Also Read: భీమ్లా నాయక్’ పాటల జ్యూక్ బాక్స్ రిలీజ్
కథ :
కృష్ణ మోహన్ (సూర్య) క్రిమినల్ లాయర్. అయితే, అతని చిన్నతనంలోనే తన చెల్లి చనిపోతుంది. దాంతో.. ఆడపిల్లలకు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటుంది అతని కుటుంబం. ఇక ఏ అమ్మాయి అయినా కష్టంలో ఉంటే..ఒక అన్నయ్యలా కృష్ణ మోహన్ సాయం చేస్తుంటాడు. ఇలాంటి కృష్ణ మోహన్ అదిరా (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడతాడు. కానీ, అదిరా ఊరికి కృష్ణ మోహన్ ఊరికి మధ్య కొన్ని గొడవలు ఉంటాయి. వాటిని అధిగమించి వీళ్ళు తమ ప్రేమను ఎలా గెలుచుకున్నారు ? మరోపక్క కామేష్ (వినయ్) కృష్ణ మోహన్ గ్రామంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. మరి కామేష్ నుంచి తన గ్రామ అమ్మాయిలను కృష్ణ మోహన్ ఎలా కాపాడుకున్నాడు ? ఈ క్రమంలో కృష్ణ మోహన్ కి వచ్చిన అడ్డంకులు ఏమిటి ? చివరకు కామేష్ కి కృష్ణ మోహన్ ఎలాంటి శిక్ష విధించాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు పాండిరాజ్ ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు. అయినా కథలోకి తీసుకెళ్లెందుకు మంచి సీన్స్ రాసుకోవాలి గానీ, అడ్డమైన సీన్స్ ను రాసుకుంటూ పోతే స్క్రీన్ ప్లే సక్రమంగా ఉండదనే విషయాన్ని పాండిరాజ్ గుర్తించకపోవడం విచిత్రం.
ఇక సూర్య – ప్రియాంక అరుల్ మోహన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బాగాలేదు. అయితే ఇంటర్వెల్ యాక్షన్ అండ్
ఎమోషన్ తో కథ ఊపందుకుంది అనుకుంటే.. అనవసరమైన సీన్స్ తో మళ్ళీ సినిమాని బోరింగ్ ప్లే సాగదీశారు. అయితే ఊహించని వెరీయేషన్ వల్ల సెకండాఫ్ పై క్యూరియాసిటీ పెరిగింది. అలాగే దర్శకుడు పాండిరాజ్ ఆడపిల్లల పై జరుగుతున్న దారుణాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు.
కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. పైగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసారు. కానీ సూర్య అద్భుతంగా నటించాడు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సూర్య సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో చాలా సహజంగా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్ :
సూర్య నటన,
ఎమోషనల్ సీన్స్,
సినిమాలో మెయిన్ పాయింట్,
సంగీతం,
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ స్క్రీన్ ప్లే,
ఓవర్ బిల్డప్ సీన్స్,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
రెగ్యులర్ స్టోరీ,
సినిమా చూడాలా ? వద్దా ?
స్త్రీల పై జరుగుతున్న అగాత్యలను ఎలివెట్ చేస్తూ భిన్నమైన ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వైవిధ్యంగా లేకపోగా నాసిరకమైన సీన్స్ తో సాగింది. అయితే, కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కాకపోతే, గ్రిప్పింగ్ నరేషన్ తో కథ చెప్పాల్సిన దర్శకుడు అర్ధం పర్ధం లేని సీన్స్ ను చూపిస్తూ ప్రేక్షకులను నిరాశ పరిచాడు. కాబట్టి, థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూడకపోవడమే మంచింది.
రేటింగ్ : 2 / 5 ,
Also Read: అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే