Assam Rifles Recruitment 2021: అస్సాం రైఫిల్స్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 1230 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్స్ మ్యాన్, టెక్నికల్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఏపీలో 64 ఉద్యోగ ఖాళీలు ఉండగా తెలంగాణలో 48 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హతతో పాటు ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://assamrifles.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లతో పాటు ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్టోబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది, ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
తెలుగు రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నా ఎక్కువ వేతనం లభిస్తూ ఉండటంతో నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ సంస్థ గతేడాది సైతం పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
Also Read: WCL recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 211 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?