Most eligible bachelor: అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తెదీ ఖరారు చేసుకుంది. దసరా కానుకగా అక్టోబరు 15న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా వరుసగా మూవీ ప్రోమోలు, సాంగ్స్ విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలె లెహరాయీ సాంగ్ రిలీజ్ చేయగా.. తాజాగా, ప్రోమో 07ను విడుదల చేసింది చిత్రబృందం. రోజుకో కొత్త వేరియేషన్స్‌తో వస్తోన్న ఈ ప్రొమోలతో ప్రేక్షకుల్లో సినిమా అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిందిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ మూవీ గతేడాదే విడుదల కావాల్సినా, కరోనా లాక్డౌన్ వల్ల అది కాస్తా వాయిదా పడింది. అఖిల్ సరసన పూజాహెగ్డే నటించారు. జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. గోపీసుందర్ స్వరాలు అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ తన హాట్ లుక్స్ కుర్రకారును కవ్విస్తున్న పూజా.. ఈ సినిమాలో కూాడా తన మార్క్‌ను చూపించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు వరుసగా తీసిన సినిమాలతో అంతంతమాత్రం గుర్తింపు తెచ్చుకుంటున్న అఖిల్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని బలంగా అనుకుంటున్నారు. ఆయన అభిమానులు కూడా అదే విధంగా ఆశిస్తున్నారు. మరి బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఏ మాత్రం విజయం సాధిస్తుందో తెలియాలంటే అక్టోబరు 15 వరకు వేచి చూడాల్సిందే.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Most eligible bachelor one more promo released from most eligible bachelor movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com