Homeఎంటర్టైన్మెంట్Daggubati: రానా, వెంకీ కాంబినేషన్​లో వెబ్​సిరీస్​!

Daggubati: రానా, వెంకీ కాంబినేషన్​లో వెబ్​సిరీస్​!

Daggubati: టాలీవుడ్​ సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబంతో పాటు దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలకూ విపరీతమైన క్రేజ్​ ఉంది. ఇటీవలె ఓటీటీ వేదికగా విడుదలైన నారప్ప చిత్రంలో విక్టరీ వెంకటేశ్​ తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాను ప్రేక్షకులు కూడా ఆదరించారు. మరోవైపు అరణ్య చిత్రంలో విభిన్న పాత్ర పోషించిన రానా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అయితే బాబాయి, అబ్బాయి కలిసి దగ్గుబాటి అభిమానులకు శుభవార్త అందించారు.

 

daggubati-a-new-web-series-coming-with-the-combination-of-rana-venkateshఅమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా ఓ సిరీస్​ రానుంది.  ఇందులో వీరిద్దరు కలిసి నటించనున్నారు. ఈ ప్రాజెక్టును లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్​ అనే సంస్థ నిర్మిస్తోంది.మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌ల‌కు ప‌ని చేసిన‌ సుప‌న్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమాన్ ఈ సిరీస్​కు దర్శకత్వం వహిస్తున్నారు.

వెంకీ, రానా ఓకే స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్​ ప్రాజెక్టు టైటిల్ “రానా నాయుడు” అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ వేదికగా నెట్ ఫ్లిక్స్​లో విడుదల కానుంది. ఇటీవలె సిరీస్ షూటింగ్ కూడా  ప్రారంభ‌మైన‌ట్టు యూనిట్ సభ్యులు తెలిపారు .

అయితే వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సిరీస్​ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుదో అని ఆసక్తికరంగా మారింది.  వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం తెర‌కెక్కిస్తున్న విరాట ప‌ర్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో భీమ్లా నాయుక్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన రానా గ్లింప్స్​ విడుదల చేసింది చిత్రబృందం. మరోవైపు వెంకీ మామ ఎఫ్ 3 షూటింగ్​లో బిజీగా ఉన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular