CM KCR: తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ తన పోరును మరింత బలంగా చేస్తోంది. ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికార టీఆర్ఎస్ పైన పోరాటం చేస్తోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన బండి సంజయ్ అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన జీవో 317కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ నిరసన కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరై తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఎఐం నేత అసదుద్దీన్‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ వారసత్వంపైనా సంచలన కామెంట్స్ చేశారు.

తెలంగాణలో వారసత్వ రాజకీయం సాగించాలని కేసీఆర్ ఆశపడుతున్నాడని విమర్శించాడు. తన తర్వాత తెలంగాణకు సీఎం తనయుడు కేటీఆర్, మనవడు హిమాన్షును సీఎం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లుగానే తెలంగాణలో నిజాం, నయా నిజాం అసుదుద్దీన్ ఒవైసీ వారసత్వానికి బీజేపీ చరమ గీతం పాడుతుందని, అందుకు బీజేపీ పని చేస్తుందని అన్నారు.
Also Read: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?
కేసీఆర్, అసదుద్దీన్ పొత్తు రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హన్మకొండలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో అసోం సీఎం పాల్గొన్నారు. బాబర్ తరహాలో అసదుద్దీన్ కథ త్వరలో ముగుస్తుందని విమర్శించారు.
నవ తెలంగాణ నిర్మాణం కోసం నిజాం వారసత్వాన్ని, ఒవైసీ వారసత్వాన్ని వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని హిమంత చెప్పారు. 317 జీవో ద్వారా సీఎం కేసీఆర్ కు ఉద్యోగుల పట్ల ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టమైందని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కారు ఇచ్చిన జీవో ద్వారా మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే కూడా తన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని భావించి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అసోం సీఎం విమర్శించారు.
Also Read: తెలంగాణలో మొదలైన ‘యాగం ఫీవర్’.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీ?
[…] […]