
Adimulapu Suresh : విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది.

G20 సదస్సులో భాగంగా..
G20 సదస్సులో భాగంగా విశాఖ నగరంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లో 3 కే, 5 కే, 10 కే రన్ పోటీలను నిర్వహించారు. అనంతరం పారాగ్లైడింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పారాగ్లైడింగ్ ను మంత్రులు ప్రారంభించగా, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పారాగ్లైడింగ్
చేసేందుకు సిద్ధమై ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఇసుక తిన్నెల్లో ఒరిగిపోవడంతో..
G20 సదస్సులో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు నిర్వహించారు. ఈ పారా మోటరింగ్ ను మిత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్ జండా ఊపి ప్రారంభించారు. పోటీలు ప్రారంభించిన అనంతరం స్వయంగా పారాగ్లైడింగ్ చేసేందుకు ఆదిమూలపు సురేష్ శబ్దమవ్వగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది జాగ్రత్తగా పట్టుకుని దించారు. ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే ఉన్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు.
ఉదయం మారథాన్ ప్రారంభించిన మంత్రి సురేష్..
G20 సదస్సులో నిర్వహించిన రన్ పోటీలు అనంతరం నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు మంత్రి బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురై ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది.మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.