Asia largest airport details: భారతదేశంలో విమానయాన రంగం దూసుకుపోతుంది. మిగతా దేశాలతో కనెక్టివిటీ పెంచడానికి విమానయానరంగం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా దేశంలో అవసరమైన చోట విమానాశ్రయాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని జేవార్ లో ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి శనివారం ప్రారంభించారు. అయితే ఇది ఆసియాలోనే అతిపెద్దది కావడంతో పాటు ప్రపంచంలో నాలుగవ పెద్ద విమానాశ్రయం గా పేర్కొంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా జిల్లా జేవార్ విమానాశ్రయం ను సుమారు 3296 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్న దీనికి సుమారు రూ.11,200 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ రన్ వే 3900 మీటర్లు. మొదటి దశలో డొమెస్టిక్ టెర్మినల్ మాత్రమే పూర్తవుతుంది. దీనికి 6 నుంచి 10 ఎయిరో బ్రిడ్జిలు ఉన్నట్లు తెలుస్తోంది. క్యాట్ 1, క్యాట్ 3 రకాల ఇన్స్ట్రుమెంట్ లాండింగ్ సిస్టం లను ఏర్పాటు చేశారు. దీంతో అత్యంత భద్రంగా లేదా సురక్షితంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విమానాశ్రయం నిర్మించడానికి అనేక టెక్నాలజీని వాడారు. సెల్ఫ్ సర్వీస్ కియోస్కోస్, ఇ గేట్, ఆటోమేటెడ్ కస్టమ్స్ క్లియరెన్స్ ఉండడంవల్ల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే వీటితోపాటు బిజినెస్ లాంజ్, వీఐపీ లాంజ్, పే ఫర్ యూస్ లాంజ్ వంటివి కూడా ఉన్నాయి.
ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కాబట్టి ఎనర్జీ ఎఫిషియన్సీ, సోలార్ ప్యానల్స్, వాటర్ రీసైకిలింగ్ వంటి హరిత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొందరు చెబుతున్న ప్రకారం ఈ ఎయిర్పోర్టును నెట్ జీరో ఎమీషన్ విమానాశ్రయంగా కూడా పేర్కొంటున్నారు. మొత్తంగా భారతదేశంలో ఈ ఎయిర్పోర్ట్ అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ హాఫ్ లో భాగమవుతుంది. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు హై స్పీడ్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ గా ఉండబోతుంది.
2026 మార్చి 28 తర్వాత సంవత్సరానికి 12 మిలియన్ లా ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేస్తుంది. మొత్తం నాలుగు దశలుగా తీరని అభివృద్ధి చేయనున్నారు. ప్రతి ఏడాదికి 70 నుంచి 100 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. 2050 సంవత్సరానికి 60 నుంచి 120 మిలియన్ల ప్రయాణికుల వరకు పెంచే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ విమానాశ్రయం వద్దకు చేరడానికి రోడ్డు తో పాటు రైలు సౌకర్యాన్ని కనెక్ట్ చేయనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి సులభంగా చేరే విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.