Homeలైఫ్ స్టైల్Largest Garlic Producing Country: ప్రపంచంలో అత్యధికంగా వెల్లుల్లి ఉత్పత్తి చేసే దేశం ఏది? గిల్రాయ్...

Largest Garlic Producing Country: ప్రపంచంలో అత్యధికంగా వెల్లుల్లి ఉత్పత్తి చేసే దేశం ఏది? గిల్రాయ్ ని వెల్లుల్లి నగరం అని ఎందుకు పిలుస్తారు?

Largest Garlic Producing Country: మనం తినే ఆహార పదార్థాల్లోనే ఆరోగ్యం ఉంటుందని కొందరు అంటుంటారు. రోజువారి కూరల్లో వాడే కొన్ని వస్తువుల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. కానీ చాలామంది వీటిని పట్టించుకోరు. ఇలా ఇంట్లో వాడే పదార్థాల్లో వెల్లుల్లి ముఖ్యమైనది. ఘాటు వాసన వచ్చే వెల్లుల్లిలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ b6, మాంగనీస్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తపోటును నియంత్రణ వస్తాయి. భారతీయ […]

Largest Garlic Producing Country: మనం తినే ఆహార పదార్థాల్లోనే ఆరోగ్యం ఉంటుందని కొందరు అంటుంటారు. రోజువారి కూరల్లో వాడే కొన్ని వస్తువుల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. కానీ చాలామంది వీటిని పట్టించుకోరు. ఇలా ఇంట్లో వాడే పదార్థాల్లో వెల్లుల్లి ముఖ్యమైనది. ఘాటు వాసన వచ్చే వెల్లుల్లిలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ b6, మాంగనీస్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తపోటును నియంత్రణ వస్తాయి. భారతీయ వంటకాల్లో వెల్లులికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ వెల్లుల్లి ఎక్కువగా ఎక్కడ పండిస్తారో తెలుసా? అంతేకాకుండా వెల్లుల్లి రాజధాని అని దేనిని పిలుస్తారు అంటే?

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోపాటు చాలా దేశాల్లో వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో వెల్లుల్లి ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా చైనా ను పేర్కొంటారు. ఆ తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్, ఈజిప్టు ఉన్నాయి. ఇక్కడ అధిక ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ్నుంచి వెల్లుల్లి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే అమెరికా రాష్ట్రాల్లోని గిల్రాయ్ నీ వెల్లుల్లి రాజధానిగా పేర్కొంటారు. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద ఎత్తున ఇక్కడ వెల్లుల్లి సాగు తో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పండించిన, ప్రాసెసింగ్ చేసిన వెల్లుల్లిని అమెరికా అంతట సరఫరా చేస్తారు. అలాగే ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తారు. గిల్రాయ్ లో సారవంతమైన నేలతోపాటు వెల్లుల్లి పెంపకానికి అవసరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలోని రైతులు పెద్ద మొత్తంలో వెల్లుల్లి ఉత్పత్తి చేయడంలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఇక్కడ వీరికి అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటగా మారిపోయింది. చాలామందికి ఈ వెల్లుల్లి ద్వారా ఉపాధి లభించడంతోపాటు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కారణం అవుతుంది.

Also Read: ఫార్మా దిగ్గజాలను గడగడలాడించిన హైదరాబాద్ డాక్టర్ కు తోడుగా..

గిల్రాయ్ లో ప్రతి ఏడాది వెల్లుల్లి ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా వెల్లుల్లి ఆధారిత వంటకాలు, వంటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. వెల్లుల్లిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వెల్లుల్లి ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా కూడా పేర్కొంటున్నారు. ఇక్కడ దాదాపు 5 వేల సంవత్సరాల కింది నుంచి ఉత్పత్తి చేయబడుతున్నట్లు చరిత్ర తెలుపుతుంది. వెల్లుల్లి ఆహార పదార్థాలు రుచిగా రావడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిని కూరలతో పాటు సూప్స్, సాస్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper