https://oktelugu.com/

సకల సంపదలు మీ సొంతం కావాలంటే.. ఈ మంత్రం జపించాల్సిందే..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సకల సంపదలను కలిగి ఉండాలని భావిస్తుంటారు. అందుకోసమే డబ్బులు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. సాధారణంగా అధికంగా డబ్బు ఉన్న వారిని మనం కుబేరులని పిలుస్తుంటారు. కుబేరుడు అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అప్పుగా ఇచ్చినవాడని మనకు తెలిసిందే.ఆ వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చాడు అంటే కుబేరుడి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.అదేవిధంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2021 / 09:19 AM IST
    Follow us on

    సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సకల సంపదలను కలిగి ఉండాలని భావిస్తుంటారు. అందుకోసమే డబ్బులు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. సాధారణంగా అధికంగా డబ్బు ఉన్న వారిని మనం కుబేరులని పిలుస్తుంటారు. కుబేరుడు అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అప్పుగా ఇచ్చినవాడని మనకు తెలిసిందే.ఆ వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చాడు అంటే కుబేరుడి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.అదేవిధంగా మన జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ కుబేరునికి పూజించడంవల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

    Also Read: ఆ గుడిలో నిద్రించే మహిళలకు ఎలాంటి కలలు వస్తాయో తెలుసా?

    సాధారణంగా మన ఇంట్లో ఉత్తర భాగాన కుబేరుని స్థానంగా పరిగణిస్తారు. ఈ భాగంలో ఎటువంటి బరువులు లేకుండా కుబేరుని విగ్రహాన్ని ఉంచి పూజ చేసి ఈ మంత్రాన్ని “ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః” అనే మంత్రాన్ని రోజూ 108 సార్లు జపం చేయటం వల్ల ఆ కుబేరుని అనుగ్రహం పొంది మనకు అష్టైశ్వర్యాలను కలిగిస్తాయి. అయితే కుబేరుని స్థానంలో ఎటువంటి వస్తువులను పెట్టకుండా ఉంచడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

    Also Read: ఆ గ్రామంలో పాము కరిచినా చనిపోరట.. ఎక్కడంటే..?

    ఉత్తరం వైపు కుబేరుని విగ్రహాన్ని పెట్టినప్పుడు నేలపై పెట్టకూడదు.కొద్దిగా ఎత్తులో ఉండే విధంగా కుబేరుని విగ్రహాన్ని ఉంచి పూజించాలి. ఒకవేళ మన ఇంట్లో కుబేరుడు విగ్రహం లేకపోతే ఆ దిశలో త్రాగే నీటిని ఉంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే సకలసంపదలతో గడపాలనుకునే వారు ఈ కుబేర మంత్రాన్ని జపం చేయటం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం