AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గంలో చోటు సంపాదించిన వారి వ్యక్తిగత వివరాలు చూస్తే అందరు చదువుకున్న వారే కావడం గమనార్హం. దీంతో వారి విద్యార్హతలు, ప్రాంతీయతలు చూస్తుంటే విచిత్రమే. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించిన వారి పూర్వాపరాలు తెలుసుకోవాలని అందరికి ఉత్కంఠ ఉండటం సహజమే.

మంత్రివర్గంలో మొదటి స్థానంలో నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1974లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా 1985, 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1989, 1999, 2004లో పీలేరు నుంచి, 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత వైసీపీలో చేరి 2014, 2019లో పుంగనూరు నుంచి విజయం సాధించి మంత్రిపదవి సాధించడం తెలిసిందే.
రైల్వేలో ఉద్యోగం చేస్తూ స్వచ్ఛంధ ఉద్యోగ విరమణ పొంది 2009లో యర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచి 2019లో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు భార్య విజయలక్ష్మి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వీరిపై సీబీఐ కోర్టులో కేసు నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి 2001 నుంచి 2006 వరకు రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో వైసీపీలో చేరి కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓటమి చెందినా 2019లో రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 2020 జులైలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన బొత్స సత్యనారాయణ 1992 నుంచి 1999 వరకు రెండు సార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా కొనసాగారు. 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినా 1999లో ఇక్కడ నుంచే పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఓటమి పాలయ్యారు. వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు.
గోపాలపురం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచిన తానేటి వనిత 2013లో వైసీపీలో చేరారు. కొవ్వూరు నుంచి 2014 ఎన్నికల్లో ఓడినా 2019లో విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందరికి సుపరిచమే. 1995 నుంచి 2006 వరకు రెండు సార్లు సర్పంచ్ గా పనిచేశారు. 2014లో తొలిసారి డోన్ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించి ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో మరోమారు మంత్రి పదవి దక్కించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా ఎదుటి వారిని తన మాటలతో కట్టడి చేసే నేతగా జోగి రమేష్ కు గుర్తింపు ఉంది. ఎవరినైనా తిట్టాలంటే రమేష్ ముందుంటారు. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు లభించింది. 2009లో తొలిసారి పెడన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి పరాజయం చెందారు. 2019లో మళ్లీ విజయం సాధించారు.
మరో ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ 2007లోనే టీడీపీ నుంచి విశాఖలో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2014లో వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
అంబటి రాంబాబు పేరు వింటేనే అందరిలో హడల్. అంతటి వాగ్ధాటి కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 1998 నుంచి కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గా ఉన్నారు. 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999లో రెండు సార్లు పరాజయం పాలయ్యారు. 1991 నుంచి 1994 వరకు నెడ్ క్యాప్ చైర్మన్ గా పని చేశారు. 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీ పార్టీలో చేరి 2014లో సత్తెనపల్లి నుంచి ఓడపోయినా గత ఎన్నికల్లో గెలిచారు.
ధర్మాన ప్రసాదరావు 1983లో సర్పంచ్ గా ప్రస్థానం ప్రారంభించారు. 1987లో ఎంపీపీగా, 1989లో నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1991, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో మంత్రి పదవులు పొందారు 2014 ఎన్నికల్లో ఓటమి పాలయినా 2019లో తిరిగి విజయం సాధించడం తెలిసిందే.
విడదల రజని 2018లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. చిలుకలూరిపేట నుంచి తొలి బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె వయసు 28 ఏళ్లు కావడం గమనార్హం. దీంతో చిన్న వయసులోనే మంత్రి పదవి సాధించిన ఘనత ఆమె సొంతం అయింది.
ఆర్కే రోజా 1999లో టీడీపీ చేరారు. 2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నుంచి ోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ లో చేరి 2014లో టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై, 2019లో ఆయన కుమారుడు భాను ప్రకాష్ పై గెలిచారు. 2019 నుంచి రెండేళ్ల పాటు ఏపీఐఐసీ చైర్మన్ గా పనిచేశారు. టీడీపీ, వైసీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.
[…] AP Sachivalayam Employees: ప్రభుత్వ ఉద్యోగమని తెగ సంబర పడిపోయారు. లక్షలాది రూపాయల ప్రభుత్వ కొలువును వదులుకున్నారు. కుటుంబసభ్యుల కళ్లెదుటే ఉండి దర్జా, డాబు ఉంటుందని అనుకున్నారు. తీరా ఉద్యోగంలో చేరికా తెలిసింది అటెండర్‌కు ఎక్కువ, గుమస్తాకు తక్కువ అన్నట్లుగా ఉండే పోస్టు అదని. రిక్రూట్‌మెంట్ సమయంలో ప్రభుత్వం గొప్ప ఉద్యోగమంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్-1 స్థాయిలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడంతో నిరుద్యగో యువత పోటా పోటీగా పరీక్షలు రాశారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేని సమయంలో దొరికిందే మహా భాగ్యమంటూ యువత ఈ ఉద్యోగాల్లో చేరిపోయారు. […]
[…] AP New Cabinet Ministers: ‘ఊరికే మంత్రులుగా కాలేదు. ఆ అందలం వెనుక అలుపెరగని కష్టం ఉంది. అవిశ్రాంత పోరాటం ఉంది.. చిటికెల్ లో ముక్కు మొఖం తెలియని వారు మంత్రులయ్యారని విమర్శలున్నాయి. విడుదల రజినీలాంటి వారు రాజకీయాల్లో దూసుకొచ్చి పిన్న వయసులోనే కీలక శాఖలు కొట్టేశారు. ఇక సీనియర్లు ఎంతో మంది ఎంతో కష్టం చేసి ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఏపీ కొత్త కేబినెట్ లో కొలువుదీరిన కొత్త మంత్రులు ఈ స్థాయికి ఎదగడం వెనుక సుధీర్ఘ పోరాటం ఉంది. వారి ఎదుగుదలపై ప్రత్యేక కథనం.. […]
[…] Wife And Husband: కట్టుకున్న వాడి వేధింపులతో భార్య చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బంధువులు భర్త కుటుంబీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భర్త సూటిపోటి మాటలకే తమ కూతురు చనిపోయిందని హతురాలి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. […]
[…] Minister Ambati Rambabu: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధాలుంటాయి. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాజకీయ నేతలు సినిమాల్లో నటించడం మామూలే. నటులు రాష్ట్రాలను ఏలిన చరిత్ర మనది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులుగా తమ సత్తా చాటి ప్రజలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారలకు నాయకులకు మధ్య సంబంధాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏనాడో బ్రహ్మంగారు కూడా చెప్పారు.ముఖానికి రంగేసుకునే వారు పాలకులవుతారని చెప్పిన విషయం తెలిసిందే. […]