https://oktelugu.com/

Aryan Khan: షారుఖ్ ఖాన్ కొడుకుకు అండగా శివసేన.. కేంద్రంతో ఫైట్

Aryan Khan shivsena:  ముంబైని డ్రగ్స్ కు రాజధానిగా చూపించాలని కేంద్రంలోని బీజేపీ కంకణం కట్టుకుందన్న విమర్శలు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నుంచి వినిపిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాకు ముంబై అడ్డా చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఎన్సీబీ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలపై పడుతోంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వారిని అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అతడికి బెయిల్ ఇప్పటికీ రాలేదు. షారుఖ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2021 / 02:35 PM IST
    Follow us on

    Aryan Khan shivsena:  ముంబైని డ్రగ్స్ కు రాజధానిగా చూపించాలని కేంద్రంలోని బీజేపీ కంకణం కట్టుకుందన్న విమర్శలు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నుంచి వినిపిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాకు ముంబై అడ్డా చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఎన్సీబీ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలపై పడుతోంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వారిని అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అతడికి బెయిల్ ఇప్పటికీ రాలేదు. షారుఖ్ ఎంత ప్రయత్నించినా హైకోర్టుకు ఎక్కినా ఆర్యన్ బెయిల్ రావడం లేదు. బయటకు వస్తాడన్న నమ్మకం ఇప్పట్లో కలగడం లేదు.

    aryan khan

    అయితే కేంద్ర ప్రభుత్వ ఎన్సీబీ కొద్దిరోజులుగా ముంబైలోని సెలబ్రెటీలను టార్గెట్ చేయడాన్ని మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ భగ్గుమంటోంది. ఎన్సీబీ కేవలం గ్రాముల్లో డ్రగ్స్ దొరికితే సినీ సెలబ్రెటీలను అష్టకష్టాలు పెడుతోందని.. తాము మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో టన్నుల కొద్ది డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ 15వేల కోట్లు ఉంటుందని ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇటీవలే చెప్పుకొచ్చాడు. ఆర్యన్ ఖాన్ ను బలిపశువును చేస్తున్నారని పరోక్షంగా విమర్శించారు.

    ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం శివసేన రంగంలోకి దిగింది. శివసేన నాయకుడు తివారీ కిశోర్ తాజాగా సుప్రీంకోర్టులో ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో నిందితులకు ప్రాథమిక హక్కులను పేర్కొంటూ ఆర్యన్ కు ఉపశమనం కలిగించాలని అభ్యర్థించాడు.

    ఎన్సీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని..దానిపై న్యాయవిచారణ చేయాలని కిశోర్ తివారీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం సంచలనమైంది. రెండేళ్లుగా ముంబైని టార్గెట్ చేసి సెలబ్రెటీలపై ఎన్సీబీ దాడులు చేస్తోందని విమర్శించారు. ఈ డ్రగ్స్ కేసుల వెనుక అసలు ఎవరున్నారో తేల్చాలని..ప్రత్యేక న్యాయవిచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తలుపు తట్టాడు.

    దీంతో ఆర్యన్ ఖాన్ కోసం శివసేన ఏకంగా కేంద్రంతో ఫైట్ కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ కు అండగా నిలిచేందుకే మోడీతో ఫైట్ కు శివసేన సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.