Srilankan Singer Yohani: ‘మణికే మాగె హితే’ అంటూ ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది శ్రీలంకకు చెందిన యొహాని. ‘మణికే మాగె హితే’ అంటూ ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది శ్రీలంకకు చెందిన యొహాని. తన అద్భుతమైన గాత్రంతో అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, సోనూ నిగమ్ తదితర ప్రముఖుల మనసులు గెల్చుకుందీ ర్యాప్ సింగర్. ఇక సోషల్ మీడియాలోనూ యొహాని పాటకు ఎంతో క్రేజ్ ఉంది. సాంగ్ కు తమ క్రియేటివిటీని జోడిస్తూ పలువురు నెటిజన్లు ఒరిజనల్ రీక్రియేషన్లు, రీమిక్స్‌లు చేస్తున్నారు.

సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ పాట త్వరలో ఓ హిందీ సినిమాలో కూడా వినిపించనుంది. అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ‘థ్యాంక్ గాడ్’ అనే సినిమాలో యొహాని సాంగ్ హిందీ వెర్షన్‌ని వాడుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఇంద్రకుమార్ అధికారికంగా ప్రకటించారు. ‘మణికే మాగె హితే’ హిందీ వెర్షన్‌ని రష్మి విరాగ్ రాయగా, తనిష్క్ బాగ్చీ స్వరమందించారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ అవకాశంపై స్పందించిన యొహాని..’ భారతీయులు నా పాటను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా నా పాట వినిపించనుంది. ఈ అవకాశం కల్పించినందుకు భూషణ్ కుమార్, ఇంద్రకుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ‘థ్యాంక్ గాడ్’ చిత్ర యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్స్. ఇండియాలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తెలుగులో కూడా ఈ అమ్మడుకి అవకాశాలు వచ్చేలా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.