Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పినట్లు జరుగుతోంది. ఫలితాలలో భారతీయ జనతా పార్టీ దూకుడు కొనసాగిస్తోంది.. ఈ ఫలితాలలో అధికార ఆమ్ ఆద్మీ కి షాక్ లు తగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఊహించని విధంగా దెబ్బతిన్నది. బిజెపి దూకుడు ముందు నిలబడలేకపోతున్నది. స్వయంగా ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. ఆయన మాత్రమే కాకుండా మనిష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా పరాజయం పాలయ్యారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాదు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా ఓటమిపాలయ్యారు. కీలక నేతలు ఓటమి కావడంతో ఆప్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇంత దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవడంతో ఆప్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు ఈ దుస్థితి దాపురించడానికి శాపమే కారణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే శాపం తగలడం వల్లే అరవింద్ కేజ్రీవాల్ దారుణంగా ఓడిపోయారని తెలుస్తోంది. ఆప్ చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమి కూడా అదే కారణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అన్నా హజారే – అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు కలిసి పనిచేశారు. 2013 లో యూపీఏ హయాంలో చోటుచేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పెట్టాలని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించడంతో అన్నా హజారేతో స్నేహానికి బ్రేక్ పడింది. రాజకీయాలకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ తీసుకొన్న నిర్ణయాన్ని అన్నా హజారే అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్యమ ఆశయాలను పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు. రాజకీయంగా ఎదగాలని కోరికను అరవింద్ కేజ్రీవాల్ పక్కన పెట్టాలని అన్నారు. ఉద్యమ స్ఫూర్తికి ఇది పూర్తిగా వ్యతిరేకమని మండిపడ్డారు. అయినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు. వాటిని స్థాపించి విజయం సాధించారు. ఢిల్లీ పీఠానికి సీఎంగా పరిపాలన సాగించడం మొదలుపెట్టారు.. ఏ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారో.. చివరికి అదే అవినీతిలో అరవింద్ కేజ్రీవాల్ నిండా మునిగిపోయారు. ఆయన ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిందని విమర్శలను మూటగట్టుకున్నారు.
మద్యం కుంభకోణం..
మద్యం కుంభకోణం ఆప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఒడిదుడుకులకు గురి చేసింది. ఈ కేసులో గత ఏడాది మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు. ఆరికంటే ముందు అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చారు.. ఒకప్పుడు అన్నా హజారే తో కలిసి ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఆయన మాట కాదని రాజకీయాలకు వచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం వల్ల వచ్చిన పాపులరిటీని ఉపయోగించుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి విస్తరించారు. కానీ నాడు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి చెప్పిన సూత్రాలను విస్మరించారు. ఆలోచనలను పక్కన పెట్టారు. ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నారు. అవినీతి ఆరోపణలలో కూరుకు పోయారు. అందువల్లే నాటి అన్నా హజారే శాపమే అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కారణమైందని.. ఇప్పటికైనా తాను చేసిన తప్పు ఏమిటో గుర్తించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. నాడు అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే తో జత కలిశారు. కానీ ఆ ఉద్యమం నుంచి అరవింద్ కేజ్రీవాల్ బయటికి వచ్చారు.. ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. రాజకీయంగా ఎదగడానికి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకోవడం దారుణం. ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ కు వాస్తవం బోధపడితే చాలని” బిజెపి నాయకులు అంటున్నారు.