Delhi election Result : సాధారణంగా జైలుకు( jail) వెళ్లి వచ్చిన నేతలకు సానుభూతి కలిసి వస్తుంది. ఈ విషయంలో ఏపీలో( Andhra Pradesh) వర్కౌట్ అయింది. అదే సమయంలో ఝార్ఖండ్ లో సైతం ఇలా జైలుకు వెళ్లి వచ్చిన నేతలకు జై కొట్టారు అక్కడి ప్రజలు. కానీ తాజాగా ఢిల్లీ ఫలితాల్లో మాత్రం ఈ సెంటిమెంట్ తిరగబడింది. జైలు నుంచి వచ్చిన నేతలకు ఇతర రాష్ట్రాల్లో పట్టం కట్టినట్టే.. ఢిల్లీ ప్రజలకు కూడా అలానే చేస్తారని అంచనాలు ఉండేవి. కానీ అవన్నీ తారుమారు అయ్యాయి. ఈ విషయంలో మాత్రం ఢిల్లీ ప్రజలు ఎంత మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లి వచ్చినా అక్కడి ప్రజలు కనికరించలేదు. ఈ విషయంలో తాము ప్రత్యేకమే అని ఢిల్లీ ప్రజలు నిరూపించారు.
* జగన్ 16 నెలల జైలు జీవితం
కాంగ్రెస్ పార్టీని( Congress Party) విభేదించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తండ్రి అకాల మరణంతో చనిపోయిన వారిని పరామర్శిస్తానని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నాడు పరామర్శలకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహించి కేసులు మోపింది. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నాయకత్వం అవినీతి కేసులను తెరపైకి తెచ్చింది. ఏకంగా 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండి పోవాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సక్సెస్ అయ్యారు. 67 అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్రకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.
* ఏపీలో పొత్తు కుదిర్చిన చంద్రబాబు అరెస్ట్
2023 సెప్టెంబర్ లో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu) అరెస్ట్ అయ్యారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపింది. దాదాపు 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోవాల్సి వచ్చింది. అటు తరువాత న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ దక్కింది. అయితే అప్పట్లో చంద్రబాబు జైల్లో ఉండగా పరామర్శించిన జనసేన అధినేత పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం ముందుకు సాగింది. బిజెపి సైతం ఆ కూటమిలో చేరింది. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.
* సరిగ్గా ఎన్నికలకు ముందు అరెస్ట్
అయితే ఈ ఇద్దరు నేతలు మాదిరిగానే ఎన్నికలకు ముందు అరెస్ట్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ). వారితో పాటు సహచర మంత్రులు సిసోడియా, సత్యేంద్ర సైతం జైలుకు వెళ్లారు. తనను జైల్లో పెట్టడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్. సీఎం పదవిని అతిశికి అప్పగించారు. అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అమ్ ఆద్మీ గట్టెక్క లేకపోయింది. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బిజెపి బంపర్ విక్టరీ కొట్టింది. చివరకు అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓడిపోయారు. ఏపీ మాదిరిగా గెలిచి తీరుతానని.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావించిన కేజ్రీవాల్ కు ఓటమి తప్పలేదు.