Arvind Kejriwal- KCR: కే దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని, తనకు నచ్చని బీజేపీని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దాదాపు రెండేళ్లుగా ప్య్రత్నం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ కూటమి కోసం కాలికి బలపం కట్టుకుని పలు రాష్ట్రాల్లో పర్యటించారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేసే ప్రయతన చేశారు. కానీ ఎవరూ కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు ముందుకు రాలేదు. రాష్ట్రానికి వెళ్లిన సమయంలో సరే అన్న నేతలు తర్వాత ముఖం చాటేశారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్‌కుమార్, హేమంత్సొరేన్, అఖిలేశ్‌యాదవ్, దేవెగౌడ, శరద్‌పవార్ లాంటి నేతలు కేసీఆర్‌ను నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో వారికి తెలుసు. దీంతో సొంతంగానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రసమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో దూరం కొట్టిన పార్టీలే తన వద్దకు వస్తాయని భావించారు.

కుమార స్వామి ఒక్కరే..
బీఆర్ఎస్ ప్రకటన తర్వాత కూడా ఏ పార్టీ నేతలు కేసీఆర్‌ను కలవలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక్కరే కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీశ్‌కుమార్, హేమత్సొరేన్ కేసీఆర్‌ను ఇప్పటికీ నమ్మడం లేదు. దీంతో కేసీఆర్‌లో ఆందోళన మొదలైంది. ఆప్‌కు ఉన్న క్రెడింట్ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్‌కు దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఢిల్లీ వెళ్లి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినా కేజ్రీవాల్ రాలేదు. దీంతో పంజాబ్‌లో రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించి దర్గరయ్యే ప్రతయ్నం చేశారు. అయినా పెద్దగా సానుకూలత రాలేదు.
లిక్కర్ స్కాం కలిపింది ఇద్దరినీ..
ఇద్దరిని కలపాలి అంటే మంచో చెడో ఏదో ఒకటి జరగాలి. ఇద్దరూ ఒకే రకమైన మంచి అయినా, ఒకే రకమైన చెడు అయినా జరిగి ఉండాలి. ఒకే రయమైన వ్యాపారం చేసి ఉండాలి. ఇలాగే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ను, కేసీఆర్‌ను లిక్కర్ స్కాం దగ్గర చేసింది. కేసీఆర్ అవినీతి పరుడు అని తెలిసిన్పటికీ కేజ్రీవాల్ దగ్గర కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ఇద్దరూ లిక్కర్ స్కాంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు కేసీఆర్ వెతుకుతున్న కేజ్రీవాల్తోస్నేహం అనుకోకుండా దగ్గర చేసింది.
పెద్దన్న అంటే సంబోధన..
బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మం వేదికగా కేసీఆర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్తీ, పంజాబ్, కేరల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ భగవంత్‌మాన్, పినరయ్ విజయన్ను ఆహ్వానించారు. ముగ్గురూ సభకు హాజరయ్యారు. సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ కేసీఆర్‌ను తమకు పెద్దన్నగా సంబోధించారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఆశిస్తున్న ప్రధాని పదవికి తనవంతు సహాకారం అందిస్తానని కేజ్రీవాల్ పరోక్షంగా అంగీకరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఎవరితోనూ పొత్తుకు ఇష్టపడని కేజ్రీవాల్ బీఆర్ఎస్ సభకు రావడమే కాకుండా కేసీఆర్‌ను తమకు పెద్దన్న అని సంబోధించడం అందరినీ ఆశ్చర్య పర్చింది. అవకాశం వస్తే ప్రధాని కావాలని ఆశిస్తున్న కేజ్రీవాల్ ఖమ్మం సభలో కేసీఆర్‌ను కీర్తించడంలో ఆంతర్యం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.

-ఇద్దరి శత్రువు మోదీ కావడమే..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ప్రభుత్వం కూరుకుపోయింది. ఇదే సమయంలో కేసీఆర్ కూతురు కవిత కూడా ఇందులో ఉన్నట్లు ఈడీ ఆధారాలతో బయటపెట్టింది. ఇదే సమయంలో కేజ్రీవాల్‌ను ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. లిక్కర్ స్కాం బయటకు రావడానికి ఆయనే కారణం. మరోవైపు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉమ్మడి శత్రువు ప్రధాని మోదీనే. దీంతో ఇద్దరూ కలిసిసోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కేజ్రీవాల్ కేసీఆర్‌ను ఖమ్మం సభలో పెద్దన్నగా ప్రస్తావించారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీని ఢీకొట్టే సత్తా కేసీఆర్‌కే ఉందని కేజ్రీవాల్ కూడా నమ్ముతున్నారా అన్న చర్చ జరుగుతోంది. పరోక్షంగా కేసీఆర్‌ను ప్రధాని అవుతారన్న సంకేతం ఖమ్మం సభద్వారా కేజ్రీవాల్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కేజ్రీవాల్ సంబోధన వెనుక రాజకీయ వ్యూహమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.