Afghanistan Crisis: 150 మంది భారతీయులను కిడ్నాప్ చేసిన తాలిబన్లు

Afghanistan Crisis: దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని.. విదేశీయులను ఏం చేయమని ఓవైపు శాంతి ప్రకటనలు చేస్తూ మరోవైపు ఈ కరుడుగట్టిన ముష్కర తాలిబాన్ మూక విదేశీయులను కిడ్నాప్ లు చేస్తోంది. తాజాగా వీరు భారత్ పౌరులపై పడ్డారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత తాలిబన్లు తాజాగా రెచ్చిపోతున్నారు. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. భారతీయులు టార్గెట్ గా మతోన్మాద ముష్కర మూకలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అప్ఘనిస్తాన్ లోని భారత ఎంబెసీల్లో సోదాలు జరిపిన తాలిబన్లు.. కీలక […]

Written By: NARESH, Updated On : August 21, 2021 2:43 pm
Follow us on

Afghanistan Crisis: దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని.. విదేశీయులను ఏం చేయమని ఓవైపు శాంతి ప్రకటనలు చేస్తూ మరోవైపు ఈ కరుడుగట్టిన ముష్కర తాలిబాన్ మూక విదేశీయులను కిడ్నాప్ లు చేస్తోంది. తాజాగా వీరు భారత్ పౌరులపై పడ్డారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత తాలిబన్లు తాజాగా రెచ్చిపోతున్నారు. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు.

భారతీయులు టార్గెట్ గా మతోన్మాద ముష్కర మూకలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అప్ఘనిస్తాన్ లోని భారత ఎంబెసీల్లో సోదాలు జరిపిన తాలిబన్లు.. కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లిన సంగతి తెలిసిందే. అదే తీరును కొనసాగిస్తూ శనివారం దాదాపు 150 మంది భారతీయులను కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని కాబూల్ లోని భారత ఎంబెసీకి చెందిన ఓ అప్ఘన్ ఉద్యోగి ధ్రువీకరించారు.

తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. అప్ఘనిస్తాన్ లోని అన్ని ప్రధాన న్యూస్ చానళ్లు కూడా ఈ వార్త కథనాలు ప్రసారం చేశాయి. తాలిబన్లకు బందీలుగా చిక్కిన భారతీయులకు వారు హానీ తలపెట్టవచ్చన్న ఆందోళన నెలకొంది. ఈ కథనాలపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు అప్ఘనిస్తాన్ కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ట్వీట్స్ చేశారు. భారతీయులను టార్గెట్ చేస్తూ తాలిబన్లు రెచ్చిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఇక తాలిబన్ల చర్యల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోద్బలం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐఎస్ఐ దగ్గరుండి భారతీయులను టార్గెట్ చేసి కిడ్నాప్ లు చేయిస్తోందని అక్కడి జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. దీనిపై భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. భారతీయుల కిడ్నాప్ ను ధ్రువీకరించలేదు.

https://twitter.com/krishnajindal07/status/1428973925069848578?s=20