మెగాస్టార్ ట్వీట్ లో ఈ విధంగా పోస్ట్ చేస్తూ.. ‘ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలన్నా, కాలుష్యానికి చెక్ పెట్టాలన్నా, భవిష్యత్ తరాలు బాగుండాలన్నా మొక్కలు నాటడం ఒక్కటే మార్గం. కాబట్టి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరిత యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో ఫ్యాన్స్ అంతా పాల్గొని ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, తనకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయమంటూ మెగాస్టార్ కోరారు.
మెగాస్టార్ తన మనసు మంచిది అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభంతో పేదవాళ్ళు అలాగే తెలుగు సినీ కార్మికులు ఇబ్బందులు పడుతుంటే.. వారికీ ఉపశమనం కలిగించడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టి సరుకులను పంపణి చేసి ఆదుకున్నారు. అలాగే సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయించారు. సినిమా జనానికి మెగాస్టార్ నిజంగా దేవుడే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చివరి దశలో ఉంది. అలాగే ఈ సినిమా పూర్తి కాగానే లూసిఫర్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారు. ఆ తరువాత దర్శకుడు మెహర్ రమేష్ తో ఒక సినిమాని స్టార్ట్ చేయనున్నారు.
మెహర్ రమేష్ తో చిరు వేదాళం రీమేక్ నే చేయబోతున్నాడు. ఇప్పటికే మెహర్ రమేష్ ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను ఫినిష్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన నటీనటులను ఎంపిక చేసే పనుల్లో ఉన్నారు టీమ్.