Arogyasree : ఏపీలో నెట్ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో గురువారం ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. రూ.1000 కోట్ల బకాయిలతో పాటు చికిత్స ధరలు పెంచాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిరసన బాట పట్టాయి. ఈనెల 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం వారితో చర్చలకు ముందుకు వచ్చింది. అయితే నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సేవల నిలిపివేతకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిచిపోనున్నాయి.
గత కొన్నేళ్లుగా ఆరోగ్యశ్రీ చికిత్స ఫీజులను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్యాకేజీ ధరలే కొనసాగుతున్నాయి. వాటిని పెంచాలని సైతం కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు బకాయిల చెల్లింపుల విషయంలో సైతం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోంది. వీటన్నింటిపై ఆగ్రహంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని వెల్లడించాయి.
తమ వి న్యాయ సమ్మతమైన డిమాండ్ లేనని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. అయినా సరే తమ విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చేస్తోందని.. వెంటనే పెండింగ్ పక్కాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ హెచ్ ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమని.. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు రోగులకు అందవని స్పష్టం చేశాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిచిపోనుండడంతో రోగులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.