ఆరోగ్య సేతు యాప్ లేకపోతే జరిమానా, జైలు

ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనేటట్లు ప్రజలను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు యాప్ లేని పక్షంలో జరిమానాతో పాటు జైలు శిక్షకు కూడా సిద్ధపడుతున్నాయి. తాజాగా యూపీలోని నోయిడాలో గౌతమ్ బుద్ధా నగర్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పాక్ చరిత్రలో తొలిసారి హిందూ పైలట్ నియామకం స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 5:25 pm
Follow us on


ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనేటట్లు ప్రజలను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు యాప్ లేని పక్షంలో జరిమానాతో పాటు జైలు శిక్షకు కూడా సిద్ధపడుతున్నాయి. తాజాగా యూపీలోని నోయిడాలో గౌతమ్ బుద్ధా నగర్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

పాక్ చరిత్రలో తొలిసారి హిందూ పైలట్ నియామకం

స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని ఆర్డర్ జారీ చేశారు. లేదంటే వారి పై లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా మన దగ్గర్లో కరోనా బాధితులు ఉన్నా…మన చుట్టుపక్కల కరోనా తీవ్రత ఎలా ఉందన్న విషయం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. ఐతే నోయిడా పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి యాప్ లేని వారిపై కేస్ బుక్ చేయాలని నిర్ణయించారు.

వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!

రోడ్లపై వచ్చే వారిని ర్యాండమ్ గా చెక్ చేస్తామని ఆరోగ్య సేతు యాప్ వారి స్మార్ట్ ఫోన్ లో లేనట్లైతే వారిపై సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద కేసు బుక్ చేస్తామని అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్) అశుతోష్ ద్వివేది ప్రకటించారు. మే 17 వరకు ఈ ఆర్డర్స్ అమల్లో ఉంటాయని చెప్పారు.

ఈ నిబంధనల ప్రకారం ఆరు నెలల జైలు లేదా రూ 1,000 జరిమానా విధింపవచ్చు. నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ప్రస్తుతం ఈ ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చారు.

ప్రస్తుతం గౌతమ్ బుద్ధ నగర్ రెడ్ జోన్‌లో ఉంది. ఇక్కడ 34 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. దాదాపు 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.