ఆర్మీ జవానుకు కరోనా.. జనగామలో కలకలం..

తెలంగాణలోని జనగామ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆర్మీలో పనిచేసే జనగామ జిల్లాకు చెందిన వ్యక్తికి తాజాగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గత వారంరోజులుగా ఆర్మీ జవాను కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది మూడురోజుల క్రితం అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా గురువారం రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని అతడిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఆర్మీజవాను […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 12:29 pm
Follow us on


తెలంగాణలోని జనగామ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆర్మీలో పనిచేసే జనగామ జిల్లాకు చెందిన వ్యక్తికి తాజాగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గత వారంరోజులుగా ఆర్మీ జవాను కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది మూడురోజుల క్రితం అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా గురువారం రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని అతడిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కొద్దిరోజుల క్రితమే ఆర్మీజవాను ఢిల్లీ నుంచి స్వస్థలమైన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి బయలుదేరాడు. నెలరోజుల క్రితం ఇండినేషన్లు రామగుండానికి వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లోనే ఆర్మీ జవాను వచ్చినట్లు తెలుస్తోంది. ఇండోనేషియన్లు కరీంనగర్లో పర్యటించడంతో ఆ ప్రాంతంలో కరోనా సోకినా సంగతి తెల్సిందే. అయితే ఈ సంఘటన జరిగిన నెలరోజులకు జవానుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అయితే ఇతడికి ట్రైన్ జర్నీలో కరోనా సోకిందా? లేక స్థానికుల నుంచి కరోనా సోకిందా? అనే తేలాల్సి ఉంది. కరోనా పాజిటివ్ రావడంతో జనగామ జిల్లాలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.