Gen Naravane: త్రివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. దీంతో త్రివిధ దళాల అధిపతుల్లో ఆయనే సీనియర్ కావడంతో ఆ బాధ్యతలు చేపట్టారు. బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ఈనెల 8న తమిళనాడులోని నీలగిరి జిల్లా కోనూరులో మరణించడంతో నరవణెకు ఈ పదవి లభించింది.
త్రివిధ దళాల్లో సీనియర్ అధికారికి అప్పగించే సంప్రదాయం ఉండటంతో నరవణె నే అందరిలో సీనియర్ కావడంతో ఆయనను చైర్మన్ గా నియమించారు. ఇప్పటివరకు బిపిన్ రావత్ ఈ బాధ్యతలు నిర్వహించేవారు. నరవణె కంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ రెండేళ్లు జూనియర్లు కావడంతో నరవణెను సీడీఎస్ గా కేంద్రం నియమించినట్లు తెలుస్తోంది.
సీవోఎస్ సీ కమిటీ బుధవారం సమావేశమై రావత్ కు నివాళులర్పించింది. అనంతరం సీడీఎస్ గా నరవాణెను నియమించింది. మహారాష్ర్టకు చెందిన ముకుంద్ నరవాణె 1960 ఏప్రిల్ 22న జన్మించారు. పుణెలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. పుణెలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. చెన్నైలోని డిఫెన్స్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1980లో సర్వీస్ లో ప్రవేశించారు.
Also Read: Stolen votes: దొంగ ఓట్లకు ఇక కాలం చెల్లిపోయిందా?
ఈశాన్య స్టేట్లలో వివిధ హోదాల్లో పనిచేసిన నరవాణె శ్రీలంక ఖతర్ నుంచి వెళ్లిన శాంతి దళాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మొత్తానికి త్రివిధ దళాల అధిపతిగా నరవాణె నియామకంతో సైన్యానికి దిశా నిర్దేశం చేసే పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. బిపిన్ రావత్ మరణంతో సైన్యం ఆందోళన చెందింది. హెలికాప్టర్ ప్రమాదంపై దేశం యావత్తు సానుభూతి వ్యక్తం చేసింది.
Also Read: Investigative Journlism : పరిశోధనాత్మక పాత్రికేయం అంతరించలేదు.. యాజమాన్యాలే చంపేశాయ్ సార్?