https://oktelugu.com/

Film Industry: చిత్ర పరిశ్రమకు కొత్త రూల్స్ ప్రకటించిన కార్మిక శాఖ…

Film Industry: చిత్ర పరిశ్రమలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులలాగే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను ప్రారంభించి తరువాత ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు సినిమాలు లేదా సీరియల్స్ చేయడం వల్ల చైల్డ్ ఆర్టిస్టుల చదువుకు ఆటంకం కలుగుతుంది. పైగా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ కార్మిక శాఖ తాజాగా సినిమా పరిశ్రమకు […]

Written By: , Updated On : December 16, 2021 / 05:32 PM IST
Follow us on

Film Industry: చిత్ర పరిశ్రమలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులలాగే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను ప్రారంభించి తరువాత ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు సినిమాలు లేదా సీరియల్స్ చేయడం వల్ల చైల్డ్ ఆర్టిస్టుల చదువుకు ఆటంకం కలుగుతుంది. పైగా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ కార్మిక శాఖ తాజాగా సినిమా పరిశ్రమకు కొన్ని నిబంధనలు విధించింది. 14 సంవత్సరా ల్లోపు పిల్లలు ఇక పై ఏ రంగాల్లో పని చేయకూడదని తాజాగా కార్మిక శాఖ స్పష్టం చేసింది.

Film Industry

Film Industry

Also Read: భర్త వదిలేశాక, పాత బంధంలోకి స్టార్ హీరోయిన్ !

సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరి చేసింది. సినిమా నిర్మాత, దర్శకుడు ఎవరైనా జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని పేర్కొంది కార్మిక శాఖ. ఇక ముందు సినిమాల్లో బాల కార్మికుల పనితీరు పై కలెక్టర్ల అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది కార్మిక శాఖ. సంబందిత చైల్డ్ ఆర్టిస్ట్ నుండి అనుమతి కూడా తప్పనిసరి చేసింది కార్మిక శాఖ. 25% పేమెంట్ జాతీయ బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ సంబందిత సినిమా నిర్మాత చేయాలని స్పష్టం చేసింది కార్మిక శాఖ. చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఉండేలా చూసుకోవాలని కార్మిక శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !