Homeఆంధ్రప్రదేశ్‌మానవత్వం మరుస్తున్నారా..?: మనుషుల్లో స్పందన ఎందుకు కనిపించట్లే..!

మానవత్వం మరుస్తున్నారా..?: మనుషుల్లో స్పందన ఎందుకు కనిపించట్లే..!

Humanity
మనుషుల్లో రోజురోజుకూ స్పందించే గుణం కరువవుతోంది. అది ఎంతలా మారిపోయిందంటే కళ్లముందు మర్డర్‌‌ జరుగుతున్నా వీడియోలు, ఫొటోలు తీయడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప.. కాపాడాలనే జిజ్ఞాసను మరిచిపోతున్నారు. ఒకవేళ అడ్డువెళ్తే తమకు ఏదైనా అపాయం వస్తుందా అనే ఆలోచనా.. లేక ఎందుకులే ఆ రిస్క్‌ అని అనుకుంటున్నారో కానీ పరిస్థితులు భిన్నంగా తయారవుతున్నాయి.

Also Read: ఎన్నికల వేళ తమ్ముళ్ల ఆధిపత్య పోరు

స్పందించే గుణం కరువై పోయిందని చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్పాల్సి ఉంది. ఇవి రెండు వేర్వేరు సమస్యలు. ఒకటి దారుణ, పైశాచిక ఘటన. రెండోది ప్రజా సమస్య. ఈ మధ్య తెలంగాణలోని పెద్దపల్లి న్యాయవాద దంపతుల హత్య జరిగిన సంగతి తెలుసు కదా. ఈ జంట హత్యలు పట్టపగలు నడి రోడ్డు మీద జరిగాయి. హంతకులు న్యాయవాది వామన్ రావును కారు నుంచి లాగి రోడ్డు మీదికి ఈడ్చుకెళ్లి పెద్ద కత్తులతో నరికారు. ఆయన భార్యను కారులోనే హతమార్చారు. జనం చూస్తుండగా ఈ హత్యలు జరిగాయి. ఈ దారుణ ఘటన జరిగినప్పుడు రోడ్డు మీద రెండు బస్సులు ఆగి ఉన్నాయి. మరికొన్ని వాహనాలూ ఉన్నాయి. కానీ ఆ బస్సుల్లోని జనం కనీసం బయటకు రాలేదు.

దుండగులు ఎప్పుడైతే వామన్ రావును లాగి రోడ్డుమీదకు పడేశారో అప్పుడే జనం బస్సులు దిగి ఒక్కసారిగా దుండగులను చుట్టుముట్టివుంటే ఈ హత్యలు జరిగేవి కావు. పోనీ గాయాలతోనైనా బయట పడేవారు. పైగా సెల్ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీశారట. అసలు దుండగులు పట్టపగలు నడి రోడ్డు మీదనే ఈ దారుణానికి తెగబడటం నిజంగా సాహసమే. జనం అడ్డుకోకపోవడం దానికి మద్దతు ఇచ్చినట్లుగా ఉంది. నడి రోడ్డు మీదనే అత్యాచారాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

Also Read: స్థానిక సంస్థలకు రీ నోటిఫికేషన్ కోసం పట్టుబడుతున్న జనసేన: ఎందుకంటే..?

ఏపీలోని మరో సమస్య విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ. దీనిపై ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు, కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన మొదలు పెట్టాయి. నిజానికి ఉక్కు కర్మాగారం సమస్య ఆంధ్రాకు సంబంధించిందో, విశాఖకు సంబంధించిందో కాదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. ఓవరాల్‌గా తెలుగు ప్రజలకు సంబంధించింది. అయితే.. హైదరాబాదులో స్థిరపడిన తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు, సెలబ్రిటీలు, ఇతర రంగాల్లో కీలకమైన వారు విశాఖ ఉక్కుపై స్పందించడం లేదు. కనీసం నిరసనలు కూడా తెలపడం లేదు. అసలు ఉక్కు ఉద్యమానికే మద్దతు తెలపం లేదు.

మొత్తంగా సినిమాలను వారిని ప్రజలు పోషిస్తున్నప్పుడు.. ప్రజా సమస్యలపై వారు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది కదా అని ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలు. విశాఖ ఉక్కు అనే కాదు ప్రజా సమస్యలపై సాధారణంగా సినీ పరిశ్రమ నుంచి స్పందన కనిపించడంలేదు. అంటే వారు ప్రభుత్వాలకు భయపడుతున్నట్లా..? లేక తమకు ఎందుకులే అన్న ధోరణా..? అనేది స్పష్టం కాకుండా ఉంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్‌‌కు, ఆంధ్రాలో జగన్‌కు వారు భయపడుతున్నారనే అపవాదు కూడా ఉంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల్లోనూ వారి వ్యాపారాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా.. కామెంట్లు చేసినా ఆటోమెటిక్‌గా ప్రభుత్వాలు వారి వ్యాపారాలపై పడడం ఖాయం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version