https://oktelugu.com/

అదే నా కల అని చెబుతున్న అనసూయ..: అదేంటో తెలుసుకుందాం

తెలుగు ఇండస్ట్రీలో కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇప్పుడిప్పుడే ఈమె మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. సుకుమార్ లాంటి దర్శకులు అనసూయను నమ్మి మంచి పాత్రలే ఆఫర్ చేస్తున్నాడు. త‌న‌ను తాను బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్‌గా అభివ‌ర్ణించుకున్న ధైర్యశాలి యాంక‌ర్ అన‌సూయ‌. బుల్లితెర‌పై తానేంటో నిరూపించుకున్న ఆమె.. ఆ త‌ర్వాత వెండితెర‌పై ఇప్పుడిప్పుడే త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. Also Read: రవితేజ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 22, 2021 / 03:40 PM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇప్పుడిప్పుడే ఈమె మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. సుకుమార్ లాంటి దర్శకులు అనసూయను నమ్మి మంచి పాత్రలే ఆఫర్ చేస్తున్నాడు. త‌న‌ను తాను బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్‌గా అభివ‌ర్ణించుకున్న ధైర్యశాలి యాంక‌ర్ అన‌సూయ‌. బుల్లితెర‌పై తానేంటో నిరూపించుకున్న ఆమె.. ఆ త‌ర్వాత వెండితెర‌పై ఇప్పుడిప్పుడే త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

    Also Read: రవితేజ ఈసారి ఇలా నవ్విస్తాడంట!

    సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ, త‌న వృత్తి, వ్యక్తిగ‌త వివ‌రాల‌ను ఎప్పటిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల‌లో తెర‌కెక్కనున్న చావు క‌బురు చ‌ల్లగా చిత్రంలో అన‌సూయ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మ‌రికొన్ని సినిమాల్లో కూడా అన‌సూయ స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌నున్నార‌నే వార్తలు ఇటీవ‌ల గుప్పుమ‌న్నాయి.

    Also Read: ‘క్యాష్’ గేమ్ షోలో ల‌క్ష‌లు.. వస్తువుల ధ్వంసం నిజమేనా?

    త‌న‌కు సంబంధించి ప్రతి అంశంపై రెస్పాండ్ అయ్యే అన‌సూయ‌.. స్పెష‌ల్ సాంగ్స్‌కు సంబంధించి జ‌రుగుతున్న ప్రచారంపై కూడా త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. తానెలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. మ‌రీ ముఖ్యంగా చావు క‌బురు చ‌ల్లగా చిత్రంలోని పాట‌ను త‌న‌ ఫ్రెండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయ‌డంతో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఆస‌క్తి చూపిన మాట నిజ‌మే అన్నారు. వెండితెర‌పై అద్భుత‌మైన పాత్రలు చేయాల‌నేది త‌న క‌ల అంటూ అన‌సూయ చెప్పుకొచ్చారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్