MIM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజులే గడువు ఉంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతున్నాయి. బీఆర్‌ఎస్ విపక్షాలకన్నా ఒక అడుగు ముందే ఉంది. అయితే కాంగ్రెస్ కూడా సైలెంట్‌గా వర్క్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీంలతో బీఆర్‌ఎస్‌కు గుక్కతిప్పుకోకుండా చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు దాని మిత్రపక్షం అయిన ఎంఐఎంను టార్గెట్ చేసింది. ఏళ్లుగా ఏడు సీట్లు గెలుస్తూ వస్తున్న ఎంఐఎంను ఈసారి నాలుగు సీట్లకు పరిమితం చేసేలా వ్యూహరచన చేస్తోంది.
కాంగ్రెస్‌లోకి మైనార్టీ నేతలు..
మైనార్టీలను కాంగ్రెస్‌వైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. అధికార బీఆర్‌ఎస్, ఎంఐఎంలో అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో పాతబస్తీపై పట్టు సాధించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. తర్వలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంఐఎం కీలక నేతలను పార్టీలో చేరుకుంటోంది. ఈ క్రమంలో పాత బస్తీలో మంచి పలుకుబడి ఉన్న అయూబ్‌ఖాన్‌ను అలియాస్ అయూబ్ పహిల్వాన్‌ను తమవైపు తిప్పుకుంది. అయూబ్ తన కుమారులు షాబాజ్‌ఖాన్, అబ్బాజ్‌ఖాన్‌తో కలిసి టీవల కాంగ్రెస్‌లో చేరారు. చార్మినార్ టికెట్ ఆశిస్తున్న షాబాజ్‌ఖాన్ ఈమేరకు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడు. పాతబస్తీ వ్యాపారవేత్త, మైనారిటీ నాయకుడు అబీబ్ ఉల్ ఇబ్రహీం కూడా ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఇబ్రహీం టీడీపీలో పనిచేశారు. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లోకి రావాలని ఇబ్రహీం కోరారు. మరో టీడీపీ మైనారిటీ నేత, మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీఖాన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈయన 2018 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయనకు 29,769 వేలకుపైగా ఓట్లు వచ్చాయి.
ఈ ముగ్గురితో ఎంఐఎంకు చెక్…
కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన పాతబస్తీకి చెందిన ముగ్గురి నేతలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలనుకుంటోంది. షాబాజ్‌ఖాన్‌కు చార్మినార్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ఆయన ఆశిస్తున్న టికెట్ ఇచ్చి ఇక్కడ ఎంఐఎంకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇక మలక్‌పేట్ టికెట్ ఆశిస్తున్న మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీఖాన్‌ను కూడా బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. టీ డీపీ నుంచే 29 వేలకుపైగా ఓట్లు సాధించిన ముజఫర్ అలీఖాన్ ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై గెలస్తాడని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు. ఇక మరో వ్యాపారవేత్త అబీబ్ ఉల్ ఇబ్రహీంను కూడా పాతబస్తీలో ఆయనకు పట్టు ఉన్న నియోజకవర్గంలో నిలిపే ప్రయత్నం చేస్తోంది. ఈ ముగ్గురి నేతలతో పాతబస్తీలో ఎంఐఎం ఆధిపత్యానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఎంఐఎంకు చెక్ పెడితే.. తద్వారా బీఆర్‌ఎస్ దూకుడుకు బ్రేక్ వేసినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Are those four seats for mim this time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com