High Court: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాలు అస్సలు కలిసి రావడం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అక్రమ ఆస్తుల కేసుల్లో ఆయనకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈక్రమంలోనే ఆయన కొన్నేళ్లు జైలు శిక్షను సైతం అనుభవించారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలన విషయంలోనూ జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగులున్నాయి. ప్రతీసారి కోర్టులచే జగన్ సర్కార్ మెట్టికాయలు వేయించుకుంటోంది.
పరిపాలన అనుభవం లేకపోవడమో లేక కోర్టులంటే లెక్కలేదో తెలియదుగానీ.. ప్రభుత్వం తన వాదనలను మాత్రం కోర్టుల్లో బలంగా విన్పించకలేక పోతుందనే టాక్ విన్పిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో అనేక అభివృద్ధి, సంక్షేమ, ఇతర కార్యక్రమాలను చేయడంలో జగన్ సర్కార్ పూర్తిగా వెనుకబడి పోతుందనే వాదనలు విన్పిస్తున్నాయి.
తాజాగా జగన్ సర్కారు కీలకమైన జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కొన్ని జీవోలను జీవోఐఆర్టీ వెబ్ సైట్లో ఉంచకుండా దాచిపెడుతుందని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తరుఫున న్యాయవాది ఎలమంజుల తమ వాదనలను నేడు హైకోర్టులో విన్పించారు.
ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో కేవలం నాలుగు నుంచి ఐదుశాతం మాత్రమే వెబ్ సైట్లో ఉంచుతుందన్నారు. మిగతా జీవోలను ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్లో ఉంచడం లేదని, ఇది సమాచార హక్కు చట్టానికి పూర్తిగా విరుద్దమని ఎలమంజుల బాలాజీ వాదించారు. దీనిపై ప్రభుత్వ తరుపు న్యాయావాది తన వాదనలు విన్పిస్తూ ప్రభుత్వం అతి రహస్య జీవోలను మాత్రమే వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం తెలిపారు.
Also Read: ప్రత్యేక హోదాపై ‘ఏపీ’ ఆశలు వదులుకున్నట్లేనా?
దీనిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏవిధంగా జీవోలను రహస్యం, అతి రహస్యమని నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని జీవోలను అధికారిక వెబ్ సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం రహస్యంగా ఉంచిన, ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంచిన జీవోల వివరాలను తెలుపాలని కోర్టు ఆదేశించింది.
ఈ విచారణను హైకోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం అన్ని జీవోల వివరాలను హైకోర్టు ముందుంచేందుకు రెడీ అవుతోంది. కోర్టు తీర్పు వచ్చాక అన్ని జీవోలను ప్రభుత్వం అధికారిక వైబ్ సైట్లో అన్ని జీవోలు ఉంచే అవకాశం ఉండనుంది. ఈ కేసులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా కన్పిస్తోంది.