Chandrababu-Nara Lokesh: చంద్రబాబు, లోకేష్ భయపడ్డారా?

కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాహాటంగా మద్దతు తెలిపిన మాట వాస్తవమే. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. టిడిపి నాయకత్వం కానీ.. చంద్రబాబు కానీ ఎక్కడా నోరు మెదపలేదు.

Written By: Dharma, Updated On : December 4, 2023 10:48 am
Follow us on

Chandrababu-Nara Lokesh: తెలంగాణలో కెసిఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆ మాటను చెప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు.తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపోటములతో మాకు ఎటువంటి సంబంధం లేదని ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీని వెనుక బిజెపి భయం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాహాటంగా మద్దతు తెలిపిన మాట వాస్తవమే. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. టిడిపి నాయకత్వం కానీ.. చంద్రబాబు కానీ ఎక్కడా నోరు మెదపలేదు. ఫలానా పార్టీకి ఓటెయ్యాలని చెప్పలేదు. అయితే ఫలితాల సరళిని చూస్తే మాత్రం టిడిపి ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్ళినట్లు స్పష్టం అవుతోంది. అటు ప్రచారంలో సైతం టిడిపి శ్రేణులు కాంగ్రెస్కు మద్దతు పలికాయి. ఫలితాలు వెల్లడి తర్వాత కూడా గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలు రెపరెపలాడాయి.

కాంగ్రెస్ గెలుపుగణతను టిడిపి ఖాతాలో వేసేందుకు ఆ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించింది. తెలంగాణలో కెసిఆర్ ను ఓడించి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని విపరీతమైన ప్రచారం చేశారు. ఈ తరహా ప్రచారం రాజకీయంగా నష్టం కలిగిస్తుందని పార్టీ పెద్దలు భయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ పేర్లతో ఒక సందేశాన్ని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం. దానిని అన్ని పార్టీల వల్లే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాలు మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి. కానీ ఓడిపోయిన వ్యక్తులను పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ తరహా ప్రకటన చేయడానికి బిజెపి కారణమని తెలుస్తోంది. తెలంగాణలో గతం కంటే సీట్లు పరంగా బిజెపి బలం పెంచుకుంది. మూడు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంది. మరోసారి మిత్రుల సాయంతో ఎన్డీఏ అధికారంలోకి రానుందని సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బిజెపికి కోపం కలిగించే ఏ అంశాల జోలికి వెళ్లకూడదని.. కాంగ్రెస్తో అంటగాకడం వల్ల బిజెపికి కోపం వస్తుందని గ్రహించే.. చంద్రబాబు, లోకేష్ ఇతర ప్రకటన చేయాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.