అందుకే నిమ్మగడ్డను తొలగించాం..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ ను నియమించామని, మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ ను కావాలనే ఆయన పదవి నుంచి తప్పించలేదని జగన్ సర్కార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తుది అఫిడవిట్‌ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 7:41 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ ను నియమించామని, మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ ను కావాలనే ఆయన పదవి నుంచి తప్పించలేదని జగన్ సర్కార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తుది అఫిడవిట్‌ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాల పరిమితి వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వివరించింది. 2014లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే 2020లో 88 ఘటనలు జరిగినట్టు వెల్లడించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అఫిడవిట్‌ లో పేర్కొంది. పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు కూడా అఫిడవిట్‌ లో పేర్కొంది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్ అవాస్తవమని అఫిడవిట్‌ లో ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉండగా రమేష్ కుమార్ లేఖ విషయంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆధారాలు ధ్వంసం చేసినట్టు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్‌ సాంబ మూర్తి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారు. ల్యాప్ టాప్‌ లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా లేఖను డెస్క్ టాప్‌ లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారు. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌ కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం.